వేమన (పుస్తకం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వేమన
"వేమన" పుస్తక ముఖచిత్రం
కృతికర్త: రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ
దేశం: భారత దేశము
భాష: తెలుగు
ప్రక్రియ: వేమన చరిత్ర
విభాగం (కళా ప్రక్రియ): ఉపన్యాసాలు
ప్రచురణ: ప్రజాశక్తి బుక్ హౌస్
విడుదల: 1929
పేజీలు: 176

వేమన అనేది వేమన జీవితం గురించి విశేషమైన పరిశోధన చేసి రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ రచించిన తెలుగు పుస్తకం.[1] దీనిని ఆంధ్రా యూనివర్సిటీ ప్రెస్సు, వాల్తేరు వారిచే 1929 సంవత్సరంలో మొదటిసారిగా ముద్రించబడింది. తదుపతి ఇది 1945, 1971 సంవత్సరాలలో పునర్ముద్రణ పొందినది. ఈ తొలి ఉపన్యాసంలో వేమన పద్య సంఖ్య, ప్రక్షిప్తాలు పరిహరించే పద్ధతి, వివిధ ప్రతులలోని పాఠభేదాలు, సాధారణ పద్యాలకు వ్యాఖ్యాతలు చేసే చిత్ర వ్యాఖ్యానాలు ప్రస్తావించాడు.[2]

వేమనకు ప్రజలపై వున్న ప్రేమను అతను ఇలా స్థాపించాడు. కవికీ ఇతరులకూ ఇంకో తేడా ఉంది. కవికి ఈ లోకమంటే బ్రహ్మాండమైన అనురాగం. అది లేకపోతే కవి కానే కాడు. ద్వేషం సృష్టించలేడు. ప్రేమ సృష్టిస్తుంది. ఇదీ వేమన కవితాత్మ. తన ఏడు ఉపన్యాసాలలో రాళ్లపల్లి వారు ఈ కవితాత్మని శక్తిమంతంగా ఆవిష్కరించాడు.

ఉపన్యాసాలు

[మార్చు]

రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ గారు తన ఉపన్యాసాలను రఘుపతి వేంకటరత్నము గారి ఔదార్యమును, ఆంధ్ర విశ్వకళాపరిషత్తు వారి అభిమానమును ప్రధానకారణాలుగా పేర్కొన్నారు.

  • 1 ఉపోద్ఘాతము
  • 2 వేమన కాల దేశములు
  • 3 వేమన సంసార స్థితిగతులు
  • 4 వేమన కాలమందిలి మతధర్మముల స్థితి
  • 5 వేమన యోగసిద్ధి మతప్రచారము
  • 6 వేమన వంటి వారు
  • 7 వేమన కవిత్వము, హాస్యము, నీతులు

విమర్శ

[మార్చు]

రాళ్లపల్లివారి వేమన గ్రంథంపై చాలా విమర్శ ఉంది. రాళ్లపల్లివారు సి.పి.బ్రౌన్ గురించి చెబుతూ, మనవారతనిని (మేమనను) కవిగా దలపకపోయినను, అతని పద్యములనన్నిటిని బహు శ్రమచే సంపాదించి, దిద్దించి, వ్రాయించి, తానే ఇంగ్లీషున టీక వ్రాసి, ప్రకటించి, శాశ్వత కీర్తి సంపాదించిన బ్రౌను దొర కూడా ఇతనిని కవియనలేదని అంటారు.

దీనికి ఆరుద్ర ‘బ్రౌను దొర ఎక్కడా స్పష్టంగా పొయిట్ అనే పదంతో వేమన గారిని పేర్కొనలేదు. నిజమే. అయితే వేమనగారిని దొరగారు ఆథర్ అనీ ఎపిగ్రమటిస్ట్ అనీ పేర్కొన్నాడు అంటూ డొంక తిరుగుడుగా వేమనను కవి అని ప్రతిష్ఠించడానికి తంటాలు పడ్డాడు. అని తెలిపాడు[3]

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2022-01-27. Retrieved 2020-04-18.
  2. "వేమన ( రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ ) | Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi". www.andhrabhoomi.net. Archived from the original on 2019-03-23. Retrieved 2020-04-18.
  3. "వేమన ( రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ ) | Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi". www.andhrabhoomi.net. Retrieved 2020-04-18.[permanent dead link]

బాహ్య లంకెలు

[మార్చు]
Wikisource
Wikisource
తెలుగువికీసోర్స్ నందు ఈ వ్యాసమునకు సంబంధించిన మూల పాఠ్యము(లు) లేక మాధ్యమము(లు) కలవు: