వైట్ సాండ్స్ మానవ పాదముద్రల శిలాజాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వైట్ సాండ్స్ శిలాజ పాదముద్రలు

అమెరికా, న్యూ మెక్సికో రాష్ట్రం లోని వైట్ సాండ్స్ నేషనల్ పార్క్‌లో కనబడిన పురాతన మానవ పాదముద్రలు. వీటిని 2009లో కనుగొన్నారు. అవి 21,000 - 23,000 సంవత్సరాల క్రితం నాటివని అవక్షేప పొరలలో లభించిన విత్తనాలను 2021 లో కార్బన్ డేటింగు చేసినపుడు తేలింది. ఇవి, అమెరికాలో మానవుల ఉనికికి అత్యంత పురాతన ఆధారాలుగా మారాయి.[1][2] తూలారోసా బేసిన్‌ లోని మంచు యుగం నాటి సరస్సు ఒడ్డున 61 పాదముద్రలు లభించాయి.[3]

అయితే, విత్తనాల కార్బన్ డేటింగ్ పద్ధతిలో కాలనిర్ణయం చెయ్యడంపై 2022 లో కొందరు సందేహాలు వ్యక్తం చేసారు. రుప్పియా సిర్రోసా అనే ఈ విత్తనాలకు సంబంధించిన మొక్కలు భూగర్భజలాల నుండి కూడా కార్బన్‌ను తీసుకుంటాయి. అందువలన రేడియో కార్బన్ డేటింగు పద్ధతిలో చేసే కాల నిర్ణయం కొన్ని వేల సంవత్సరాలు ఎక్కువ చూపించే అవకాశం ఉందని వారు వాదించారు.[4] మళ్ళీ 2023 లో పుప్పొడిపై రేడియోకార్బన్ డేటింగు, పాదముద్రల పొరలలోని క్వార్ట్జ్ గ్రెయిన్లను ఆప్టికల్లీ స్టిమ్యులేటెడ్ లుమినిసెన్స్ డేటింగ్‌ను చేసాక, విత్తనాల ద్వారా లెక్కించిన తేదీలు సరైనవేనని శాస్త్రవేత్తలు ధృవీకరించారు.[4]

మూలాలు[మార్చు]

  1. Zimmer, Carl (September 23, 2021). "Ancient Footprints Push Back Date of Human Arrival in the Americas". The New York Times. ISSN 0362-4331. Retrieved April 8, 2022.
  2. Gershon, Livia (September 24, 2021). "Prehistoric Footprints Push Back Timeline of Humans' Arrival in North America". Smithsonian Magazine. Retrieved April 8, 2022.
  3. "The discovery of ancient human footprints in White Sands National Park and their link to abrupt climate change". United States Geological Survey. Earth Science Matters Newsletter. Retrieved 23 April 2022.
  4. 4.0 4.1 Johnson, Carolyn (October 5, 2023). "Ancient footprints upend timeline of humans' arrival in North America". The Washington Post. Retrieved October 6, 2023.