Jump to content

వైదీశ్వరన్ కోయిల్

అక్షాంశ రేఖాంశాలు: 11°11′N 79°42′E / 11.18°N 79.7°E / 11.18; 79.7
వికీపీడియా నుండి
Vaitheeswaran Temple
Vaitheeswaran Temple is located in Tamil Nadu
Vaitheeswaran Temple
Vaitheeswaran Temple
Location in Tamil Nadu
భౌగోళికాంశాలు :11°11′N 79°42′E / 11.18°N 79.7°E / 11.18; 79.7
పేరు
ఇతర పేర్లు:Pullirukkuvelur [1]
ప్రదేశం
దేశం: India
రాష్ట్రం:Tamil Nadu
ప్రదేశం:Vaitheeswaran Koil
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:Vaidyanatha Swamy[2]
ప్రధాన దేవత:Thayyal Nayagi[2]
పుష్కరిణి:Siddha Amritam
నిర్మాణ శైలి, సంస్కృతి
వాస్తు శిల్ప శైలి :Dravidian architecture

వైదీశ్వరన్ కోయిల్ భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రానికి చెందిన శైవ క్షేత్రం.

ఆలయ విశేషాలు

[మార్చు]

తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరు జిల్లాలో వున్న వైదీశ్వరన్ కోయిల్ ఇదు అంతుస్తులతో చోళరాజుల కాలంనాటి వైదీశ్వరుని గుడి కారణంగా ఆ పేరొచ్చింది. ఈ దేవాలయం 1600 సంవత్సరాల క్రితానికి చెందినది. అంగారకుడు ఒకసారి కుష్టుతో జబ్బున పడ్డాడట. జబ్బుపడిన అంగారకుడికి వైద్యం చేయడానికి, వైద్యుడిగా ఈశ్వరుడే అవతారమెత్తి వచ్చి చికిత్స చేసిన ప్రాంతం. కాబట్టి, ఈ ప్రాంతానికి వైదీశ్వరన్ కోయిల్ అనే పేరు వచ్చింది. (తమిళంలో గుడిని కోయిల్ అంటారు) జ్యోతిష్యానికి ఆద్యుడు అగస్త్య మహాముని. జ్యోతిష్యంలో ఒక భాగం నాడీశాస్త్రం. బొటనవేలి ముద్రల ఆధారంగా మానవుల భూత, భవిష్యత్, వర్తమానాలను చెప్పే పద్ధతి ఈ వూరులో ఉంది. ఈ గ్రామంలో దాదాపు పన్నెండుమంది పండితులు అనువంశికంగా తమకు సంక్రమించిన తాళపత్రాల ఆధారంగా నాడీ జ్యోస్యాన్ని చెప్పడంలో ప్రసిద్ధులు.

(కర్నాటకలోని కోడిమెట్ అనే గ్రామంలోనూ నాడీ జ్యోతిష్యం చెబుతారు. ఇందిరాగాంధీ బ్రతికున్న రోజుల్లో ఆమె తరచూ అక్కడికెళ్ళేవారు. కేంద్ర, రాష్ట్ర మంత్రులే కాదు- రాష్ట్రపతులు, అత్యున్నత పదవులలంకరించిన వ్యక్తులు చాలామంది కోడిమెట్ వెళ్ళారు. వెళుతున్నారు. అయితే వైదీశ్వరన్ కోయిల్ నాడీ జ్యోతిష్యంతో పోలిస్తే కోడిమెట్ ప్రాముఖ్యత ఒకింత తక్కువే. ప్రపంచ వ్యాప్తంగా ఈ రెండు గ్రామాలే నాడీ జ్యోతిష్యానికి కేంద్రబిందువులు)

వైద్యనాథ అష్టకం

[మార్చు]

శ్రీ రామసౌమిత్రి జటాయువేద షడాననాదిత్య కుజార్చితాయ |
శ్రీనీలకంఠాయ దయామయాయ శ్రీ వైద్యనాథాయ నమః శివాయ || 1 ||
గంగాప్రవాహేందు జటాధరాయ త్రిలోచనాయ స్మర కాలహంత్రే |
సమస్త దేవైరభిపూజితాయ శ్రీ వైద్యనాథాయ నమః శివాయ || 2 ||
భక్తఃప్రియాయ త్రిపురాంతకాయ పినాకినే దుష్టహరాయ నిత్యమ్ |
ప్రత్యక్షలీలాయ మనుష్యలోకే శ్రీ వైద్యనాథాయ నమః శివాయ || 3 ||
ప్రభూతవాతాది సమస్తరోగ ప్రనాశకర్త్రే మునివందితాయ |
ప్రభాకరేంద్వగ్నివిలోచనాయ శ్రీ వైద్యనాథాయ నమః శివాయ || 4 ||
వాక్శ్రోత్ర నేత్రాంఘ్రి విహీనజంతోః వాక్శ్రోత్రనేత్రాంఘ్రిసుఖప్రదాయ |
కుష్ఠాదిసర్వోన్నతరోగహంత్రే శ్రీ వైద్యనాథాయ నమః శివాయ || 5 ||
వేదాంతవేద్యాయ జగన్మయాయ యోగీశ్వరధ్యేయపదాంబుజాయ |
త్రిమూర్తిరూపాయ సహస్రనామ్నే శ్రీ వైద్యనాథాయ నమః శివాయ || 6 ||
స్వతీర్థ మృద్భస్మ భృతాంగభాజాం పిశాచ దుఃఖార్తి భయాపహాయ |
ఆత్మస్వరూపాయ శరీరభాజాం శ్రీ వైద్యనాథాయ నమః శివాయ || 7 ||
శ్రీ నీలకంఠాయ వృషధ్వజాయ స్రక్గంధ భస్మాద్యభి శోభితాయ |
సుపుత్రదారాది సుభాగ్యదాయ శ్రీ వైద్యనాథాయ నమః శివాయ || 8 ||

చెన్నై నుండి 235 కి మీ' చిదంబరం నుండి 27 కి మీ దూరములో సిర్గాలి నుండి 7 కి మీ దూరంలో కలదు

మూలాలు

[మార్చు]
  1. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; tourist అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  2. 2.0 2.1 ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; Seth అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు