Jump to content

వైద్యశాస్త్రంలో నోబుల్ బహుమతులు 2024

వికీపీడియా నుండి

జన్యుపదార్థంలోని చిన్నపాటి తునకలైన మైక్రో RNAను కనుగొన్న అమెరికన్ శాస్త్రవేత్తలు విక్టర్ ఆంబ్రోస్, గ్యారీ రవ్ కున్ లకు 2024 సంవత్సరానికి గాను వైద్యరంగంలో నోబెల్ పురస్కారాలు అందుకున్నట్లు ఎంపిక కమిటీ 2024 అక్టోబర్ 7వ తేదీన ప్రకటించింది[1]. కణ స్థాయిలో జన్యువుల పనితీరును మార్చే సామర్థ్యం మైక్రో RNA కు ఉంది. జన్యువులను, జీవక్రమాన్ని మైక్రో ఎలా ప్రభావితం చేస్తుంది, మొత్తంగా మనుషులతో పాటు ఇతర జీవజాలాన్ని ఎలా నియంత్రిస్తుందన్న అంశాలను వారి సంచలనాత్మక పరిశోధన లోతుగా అధ్యయనం చేసింది. అంబ్రోస్, రవ్ కున్ ల పరిశోధన ... జీవులు ఎలా అభివృద్ధి చెందుతాయి, ఎలా పనిచేస్తాయి అనే అంశాలను అర్థం చేసుకోవడంలో కీలకంగా మారుతుందని నోబుల్ ఎంపిక కమిటీ తెలిపింది[2]. జన్యు నియంత్రణకు సంబంధించి నూతనంగా సరికొత్త సూత్రాన్ని వెలుగులోకి తెచ్చిందంటూ నోబెల్ కమిటీ ప్రశంసలు కురిపించింది. నోబెల్ పురస్కారం ద్వారా వచ్చే పది లక్షల డాలర్లను వీరిద్దరికీ పంచుతారు. విక్టర్ అంబ్రోస్, గ్యారీ రావ్ కున్ లు తమ పరిశోధన ద్వారా నియంత్రణ అనే కొత్త సూత్రాన్ని నూతనంగా వెలుగులోకి తీసుకువచ్చారు. మానవులకు, బహుళ కణ జీవులకు ఇది చాలా కీలకం. విక్టర్ అంబ్రోస్, గ్యారీ రవ్ కున్ శాస్త్రవేత్తలు ఇద్దరు పరిణామాలను నియంత్రిస్తూ తద్వారా సరైన సమయంలో కణాల వృద్ధి చెందేలా చూసే జంతువులపై తొలత ఆసక్తి చూపారు. జన్యు మార్పిడి చేసిన రెండు రకాల కీటకాలపై పరిశోధనలు చేశారు. వీటిలో ఉత్పరివర్తన చెందిన జన్యులు, వాటి పాత్రను గుర్తించాలనుకున్నారు. జన్యులను మైక్రో RNA నియంత్రిస్తున్నట్లు కనుగొన్నారు. కణస్థాయిలో జన్యువులు పనితీరు నియంత్రించడంలో సాయి పట్నం ద్వారా క్యాన్సర్ వంటి వ్యాధుల నివారణకు మైక్రో ఆర్ఎన్ఏ కొత్త మార్గాలను చూపింది.

  • అంబ్రోస్ ప్రస్తుతం మసాచ్చు సెట్స్ విశ్వవిద్యాలయ మెడికల్ స్కూల్లో నాచురల్ సైన్స్ ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు. ఆయన హర్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఉండగా మైక్రో RNA పై పరిశోధన చేశారు.
  • రవ్ కున్ ప్రస్తుతం హర్వర్డ్ మెడికల్ స్కూల్లో జొన్న శాస్త్ర ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తున్నారు.
  1. "The Nobel Prize 2024: an interactive guide". The Hindu. Retrieved 2024-12-05.
  2. "All Nobel Prizes 2024". NobelPrize.org (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2024-12-05.