Jump to content

వైష్ణవి

వికీపీడియా నుండి
వైష్ణవి
జననం1986 ఫిబ్రవరి 2
మరణం2006 ఏప్రిల్ 17 (20 ఏళ్ల వయసు)
అన్నా నగర్ చెన్నై

వైష్ణవి (1986 ఏప్రిల్ 2 – 2007 ఏప్రిల్ 17) ఒక భారతీయ సినిమా, టెలివిజన్ నటి. ఆమె తమిళ సినిమా, సీరియల్స్ లలో నటించింది.

కెరీర్

[మార్చు]

వైష్ణవి అన్నీ, ముహూర్తం, మలర్గళ్ అనే తమిళ ధారావాహికలలో నటించింది. విజిల్ (2019) చిత్రంలో కథానాయక షెరిన్ స్నేహితురాలిగా నటించింది. సన్ టీవీలో ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమయ్యే కొండాట్టం అనే కామెడీ ప్రోగ్రామ్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరించింది.

మరణం

[మార్చు]

వైష్ణవి 20 ఏళ్ల వయసులో 17 ఏప్రిల్ 2006న చెన్నైలోని తన ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది. ఆమె తల్లిదడ్రులు, చెల్లెలు తన తాత పుట్టినరోజుకు వెళ్లారు. వాళ్లు వెళ్లిన తర్వాత ఆమె ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సీరియల్ నటుడు దేవ్ ఆనంద్ తనను ఆత్మహత్యకు ప్రేరేపించాడని ఆరోపణలు వచ్చాయి.[1] ఆయనను స్థానిక పోలీసులు 2006 ఏప్రిల్ 19న అరెస్టు చేసారు.

మూలాలు

[మార్చు]
  1. ↑ "TV actor gets 5-year jail for abetting suicide". The Times of India. 2011-11-01. ISSN 0971-8257. Retrieved 2023-12-09.
"https://te.wikipedia.org/w/index.php?title=వైష్ణవి&oldid=4941351" నుండి వెలికితీశారు