వైష్ణవి ధన్‌రాజ్
వైష్ణవి ధనరాజ్ | |
---|---|
జననం | వైష్ణవి భోయార్ 1988 ఆగస్టు 25 నాగ్‌పూర్, మహారాష్ట్ర, భారతదేశం |
వృత్తి | నటి, మోడల్ |
క్రియాశీల సంవత్సరాలు | 2008–ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | నితిన్ సహరావత్ (m. 2012 - 2016) |
వైష్ణవి ధనరాజ్ (జననం 1988 ఆగస్టు 25) భారతీయ టెలివిజన్, సినిమా నటి. సెక్స్ కామెడీ జానర్‌లో వచ్చిన పీకె లేలే ఎ సేల్స్‌మన్ అనే వయోజన హిందీ చిత్రంలో ఆమె నటించింది. ఇందులో ఆమె మేరీ మార్లో అనే ధనిక అమ్మాయి పాత్రను పోషించింది.[1] ఆమె ఆజ్ తక్‌లో సత్యాగ్రహంలో నిర్భయగా[2], సోనీ ఎంటర్‌టైన్‌మెంట్ టెలివిజన్ ధారావాహిక సి.ఐ.డి.లో ఇన్‌స్పెక్టర్ తాషాగా[3], నా ఆనా ఈజ్ దేస్ లాడోలో జాన్వి, బెగుసరాయ్‌లో మాయా ఠాకూర్, కలర్స్ టీవీ బేపన్నాలో మహి అరోరాగా నటించింది.
2011లో, ప్రముఖుల బ్లాగుల ప్రచురణలో భాగంగా టైమ్స్ ఆఫ్ ఇండియా అనేక బ్లాగులు ఆమెపై రాసింది.[4]
ప్రారంభ జీవితం
[మార్చు]ఆమె నాగ్‌పూర్‌లో వైష్ణవి భోయార్ గా జన్మించింది. బ్లైండ్ రిలీఫ్ అసోసియేషన్ అనుబంధ సంస్థ ముండల్ హైస్కూల్ నుండి ఆమె పాఠశాల విద్యను పూర్తిచేసింది.[5] ఆమె శివాజీ సైన్స్ కాలేజీలో చదివి గ్రాడ్యుయేషన్ పట్టాపుచ్చుకుంది. 2008లో, ఆమె కుటుంబం థానే జిల్లా కళ్యాణ్‌కి మారింది. తల్లిదండ్రులు ఆమె కళాత్మక అభిరుచిని ప్రోత్సహించారు.
కెరీర్
[మార్చు]ఆమె 2008లో కసౌతి జిందగీ కే చిత్రంలో అతిథి పాత్రతో తన నటనా జీవితాన్ని ప్రారంభించింది. అదే సంవత్సరం కరమ్ అప్నా అప్నాలో కూడా ఆమె నటించింది. వైష్ణవి భోయార్ పేరుతో ఈ రెండు షోలలో నటించిన తర్వాత, తన తండ్రి పేరు ధన్‌రాజ్‌తో మార్చుకుంది.[6]
2009లో ఆమె సి.ఐ.డి.లో నటించింది. ఆమె తాషాగా విస్తృతంగా ప్రాచుర్యం పొందింది. కిచెన్ ఛాంపియన్ 4, ఇండియాస్ గాట్ టాలెంట్, క్రైమ్ పెట్రోల్, హమ్ నే లి హై-షపత్, ఫియర్ ఫైల్స్ వంటి ఎపిసోడిక్ షోలలో ఆమె నటించింది.[7][8][9] ఆమె కలర్స్ టీవీ బేపన్నాలో మహి అరోరా పాత్రను పోషించింది.
మూలాలు
[మార్చు]- ↑ "PK Lele A Salesman Movie Review". The Times of India. Retrieved 4 August 2019.
- ↑ "Vaishnavi to recreate Nirbhaya". The Times of India. Retrieved 14 April 2014.
- ↑ "Vaishnavi Tasha to die in CID". The Times of India. Retrieved 28 February 2011.
- ↑ "Here I am". The Times of India. 23 July 2011. Retrieved 15 April 2014.
- ↑ New surname has brought me luck: Vaishnavi The Times of India, 21 December 2010
- ↑ Elina Priyadarshini Nayak (21 December 2010). "Times Of India". Retrieved 11 May 2019.
- ↑ tellybuzz. "Dharamji shakes a leg with Vaishnavi Dhanraj on India's Got Talent 3 Grand Finale". bollycurry.com. Retrieved 15 April 2014.
- ↑ tellybuzz. "Dharamji with Rashmi Desai, Dipika Samson and Vaishnavi Dhanraj on India's Got Talent 3 Grand Finale". bollycurry.com. Retrieved 15 April 2014.
- ↑ Abdul Rehman (1 May 2013). "Vaishnavi Dhanraj to play a super villain in Shapath". indiandrama.info. Archived from the original on 19 అక్టోబరు 2013. Retrieved 15 April 2014.