వోల్ట్ మీటర్
విద్యుత్ పొటెన్షియల్కు ప్రమాణం వోల్టు. . విద్యుత్ వలయంలో రెండు బిందువుల మధ్య విద్యుత్ పొటెన్షియల్ ను కొలవడానికి వోల్ట్ మీటరును ఉపయోగిస్తారు. అనలాగ్ వోల్ట్ మీటరులో ఒక సూచిక స్కేలుపై కదులుతుంది. అదే డిజిటల్ వోల్ట్ మీటరులో సంఖ్యలు కనిపిస్తాయి. విద్యుత్ వలయంలో వోల్ట్ మీటరును ఒక వృత్తంలో V గుర్తును ఉంచి సూచిస్తారు.
అనలాగ్ వోల్ట్ మీటరు
[మార్చు]కదిలే తీగచుట్ట గాల్వనామీటరుకు ఒక నిరోధాన్ని శ్రేణిలో కలిపితే వోల్ట్ మీటరు తయారవుతుంది.
ఇది విద్యుత్ ప్రవాహ తీగచుట్టను ఏకరీత్తి ఆయస్కాంతా క్షేత్ర్రంలో ఉంచినపుడు దానిపై టార్క్ పనిచేస్తుంది ఆనే నియమంపై పనిచేస్తుంది.
- దీనిలో విద్య్దుత్ బంధితా రాగి తీగతో ఒక ఫ్రేముపై చుట్టిన దీర్ఘచతురాస్రాకారపు తీగచుట్ట ఉంటుంది.
- ఈ చుట్టను విమోటన శీర్షం నుండి ఒక ఫాస్ఫార్ బ్రాంజ్ తీగతో బలమైన గుర్రపునాడా ఆయస్కాంతా ధ్రువాల మధ్య వ్రేలాడదీస్తారు.
- తీగచుట్ట క్రింది కొనకు ఫాస్ఫార్ బ్రాంజ్ స్ప్రింగ్ కు కలుపుతారు.
- ఒక చిన్న దర్పణం ను ఫాస్ఫార్ బ్రాంజ్ తీగకు వ్రేలాడదీసి తీగచుట్టలో అపవర్తనాన్ని కొలుస్తారు.
- ఒక ఇనుప స్థూపాన్ని తీగచుట్ట మధ్యలో బిగిస్తారు. అందువలన అయస్కాంతా ప్రేరణ తీవ్రత పెరుగుతుంది.
- పుటాకార అయస్కాంత ధ్ర్రువాలు వాటి మధ్య ఉన్న ఆయస్కాంత క్షేత్రాన్ని రేడియల్ క్షేత్రంగా చేస్తాయి.
- ఈ మొత్తం అమరికను ఒక గాజు కిటికీ ఉన్న ఇత్తడి పెట్టెలో ఉంచుతారు.
గాల్వనా మీటరును వోల్టు మీటరుగా మార్చుట
[మార్చు]అధిక నిరోధం ను గాల్వనామీటరుకు శ్ర్రేణిలో కలుపుట వల్ల ఆది వోల్టు మీటరుగా మారుతుంది. వోల్టు మీటరును వలయంలో రెండు బిందువుల మధ్య పొటెన్షియల్ తేడాలు కొలిచేందుకు వాడుతారు. వోల్టు మీటరును వలయాలలో సమాంతరంగా కలుపుతారు.
డిజిటల్ వోల్టు మీటరు
[మార్చు]తెలియని ప్రవేశా వోల్టేజీని సంఖ్యల రూపంలో డిజిటల్ వోల్టుమీటరులో తెలుసుకోవచ్చు. ఇందులొ ప్రత్యేక రకం అనలాగ్ నుండిజిటల్ కు మార్చే విధంగా తయారుచేసారు. దీనిని ఇంటిగ్రేటెడ్ కన్వర్టర్ అందురు.
ఈ వోల్టు మీటరులోని కొలతలు ఉష్ణోగ్రత, విద్యుత్ ఏకాంతర ప్రవాహానికి వచ్చిన పూర్తి విద్యుత్ర్పవాహావరోధం, DVM పవర్ సప్లై వంటి వివిధ కారకాల వలన మారుతుంటాయి. తక్కువ ఖరీదు గాల DVM లకు నివేశ నిరోధం 10 MΩ వరకు ఉంటుంది. ఖరీదైన DVM ల నివేశ నిరోధం 1 GΩ లేదా అత్యల్ప వోల్టేజీ అవధులకు ఎక్కువగానూ ఉంటుంది.
మొట్ట మొదటి డిజిటల్ వోల్ట్‌మీటరును అరేఖీయ వ్యవస్థలకు "ఆండ్ర్రూ కే"(తరువాత కైప్రో కనుగొన్నాడు) తయారు చేసాడు.[2]
యివి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ BOOKS, VIKRAM (2015-09-11). INTERMEDIATE II YEAR PHYSICS(Telugu Medium) Question Bank. Vikram Publishers Pvt Ltd.
- ↑ Markoff, John (5 Sep 2014). "Andrew Kay, Pioneer in Computing, Dies at 95". Obituary. New York Times. Retrieved 7 September 2014.
బయటి లంకెలు
[మార్చు]- DC Metering Circuits chapter from Lessons In Electric Circuits Vol 1 DC free ebook and Lessons In Electric Circuits series.