వ్యతికరణ రకాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వ్యతికరణ దృగ్విషయాన్ని రెండు రకాలుగా వర్గీకరణ చేస్తారు.

1.తరంగాగ్రం విభజన

[మార్చు]

పతన తరంగాగ్రం రెండు భాగాలుగా విభజన చెందుతుంది.దీనికి పరావర్తనం,వక్రీభవనం లేదా వివర్తనం సహకరిస్తాయి.ఈ రెండు తరంగాగ్రభాగాలు అసమదూరాలు ప్రయాణిస్తాయి.తరువాత తిరిగి కొంత కోణంలో సంకలనం చెందుతాయి.అపుడు వ్యతికరణ పట్టీలు ఏర్పడతాయి.ఫ్రెనెల్ ద్విపట్టకం,లాయిడ్ దర్వణం యీ రకపు వాటికి ఉదాహరణలు.

2.కంపన పరిమితి విభజన

[మార్చు]

లోపలకు ప్రవేశించే కాంతిపుంజం రెండు భాగాలుగా,సమానాంతర పరావర్తనం లేదా వక్రీభవనం ద్వారా విభజించబడుతుంది.రెండు విభిన్నమార్గాలు ద్వారా యీ రెండు విభజన చెందిన భాగాలు కొంత దూరం ప్రయాణించి,తిరిగి కలుసుకొని వ్యతికరణం ప్రదర్శిస్తాయి.న్యూటన్ రింగులు,మైకెల్సన్ వ్యతికరణ మాపకం యీ రకానికి చెందినవి.

దస్త్రం:వ్యతికరణ
Interferenz

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]

[1]

  1. Principles of optics: electromagnetic theory of propagation, interference and diffraction of light.