Jump to content

వాణిజ్యశాస్త్రం

వికీపీడియా నుండి
(వ్యాపారస్తులు నుండి దారిమార్పు చెందింది)
16 వ శతాబ్దపు వ్యాపారి జార్జ్ గిజ్ చిత్రం

వాణిజ్య శాస్త్రం ను ఇంగ్లీషులో కామర్స్ (Commerce or Business Archived 2021-08-04 at the Wayback Machine) అని అంటారు. వ్యాపారం లేదా వర్తకం లో జరిగే వ్యవహారాలను ఒక క్రమ పద్ధతిలో నమోదు చేయటాన్ని వాణిజ్యం అంటారు. వ్యాపారానికి సంబంధించిన వ్యవహారాలు గురించి తెలిపే శాస్త్రం. వాణిజ్య సంస్థ, కంపెనీ లేదా ఎంటర్ ప్రైజ్ అనగా వస్తువుల్ని ఉత్పత్తి చేయడానికి లేదా వినియోగదారులకు సేవల్నిఅందించడానికి ఏర్పడినట్టు చట్టపరంగా గుర్తింపు పొందిన సంస్థ.[1] ఇలాంటి వ్యాపారాలు పెట్టుబడిదారి (కాపిటలిస్ట్) వ్యవస్థలో ఎక్కువగా కనిపిస్తాయి. ఇవి ఎక్కువగా ప్రైవేటు వ్యక్తులచే నడుపబడతాయి. వీటి ముఖ్యమైన ఉద్దేశం లాభాల్ని ఆర్జించడం, వాటి అధిపతుల్ని ధనవంతుల్ని చేయడం. సోషలిస్టు వ్యవస్థలో ప్రభుత్వ సంస్థలు లేదా పబ్లిక్ లేదా సహకార సంస్థలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారం లేక వర్తకం చేసే వ్యక్తిని వ్యాపారస్తుడు లేక వర్తకుడు అంటారు. వ్యాపారస్తుడిని ఆంగ్లంలో బిజినెస్‍మెన్ అంటారు.

మూలాలు

[మార్చు]
  1. "Savvas Social Studies Programs - Savvas (formerly Pearson K12 Learning)". www.savvas.com. Archived from the original on 2016-12-20. Retrieved 2021-02-26.

వెలుపలి లంకెలు

[మార్చు]