వ్యాపార కార్యాల నిర్వహణ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మనకు ఇచ్చిన లేదా మనము ప్రారంభించిన పనులను సమర్థంగాను, ప్రభావవంతంగాను జరిపించే పద్ధతిని "నిర్వహణ" అంటాం. ఆ పనులు వ్యాపార సంబంధమైనవి కావచ్చు, పరిశ్రమలకు సంబంధించినవి కావచ్చు, రాజకీయాలకు సంబంధించినవి కావచ్చు లేదా విందు, వినోదాలకు సంబంధించినవైనా కావచ్చు. వ్యాపార కార్యకలాపాల నిర్వహణ, పారిశ్రామిక వ్యవహారాల నిర్వహణ, రాజకీయకార్యకలాపాల నిర్వహణ, ఉత్సవాల నిర్వహణ వీటిలో కొన్ని. వీటిలో ఏ సంఘటనను నిర్వహించేవారినైనా సంఘటనానిర్వాహకులు అంటాం. వ్యాపార కార్యకలాపాల నిర్వహణను వాణిజ్య కార్యకలాపాల నిర్వహణ అని కూడా అంటాం. సంఘటన నిర్వహణ అనేది ఇప్పుడు ఉద్యోగావకాశాలను కల్పించే పరిశ్రమగా కూడా తయారైంది. ముఖ్యంగా వివాహాలను జరిపే సంపన్నులు ఇలాంటి సంఘటన నిర్వాహకులను సంప్రదించి, తమ కోర్కెలకు, హోదాకు, వైభవానికి సరిపడిన స్థాయిలో వివాహమహోత్సవం జరిగేలా చూసుకుని మిత్రుల, హితుల, బంధువుల పొగడ్తలను, మగపెళ్లివారి మన్నలను పొందుతున్నారు.