శంకర గ్రంథ రత్నావళి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సమకాలీన హిందూమతం ఆలోచనా సరళిపై అత్యంత ప్రభావం కలిగిన సిద్ధాంతవేత్త ఆది శంకరాచార్యుడు. ఈ ఆచార్యుడు హిందూమతాన్ని ఉద్ధరించిన త్రిమతాచార్యులలో ప్రధముడు. గొప్ప పండితుడు, గురువు, మహాకవి. ఇతను ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని అద్వైతం అంటారు. శంకరుడు సాక్షాత్తు శివుని అవతారమని నమ్మకం ఉంది. బౌద్ధం వల్ల తరిగిపోయిన హిందూమత ప్రాబల్యాన్ని తిరిగి పాదుకొల్పేందుకు ఏ విధమైన బలప్రయోగం లేకుండా, తర్కం ద్వారా ఒప్పించి విజయం సాధించారు. శంకరాచార్యుడు వేదాన్ని నమ్ముతూనే పదుల సంఖ్యలో విభాజితమైపోయిన ఆధ్యాత్మిక విధానాలను, మతాలను ఏకీకృతం చేసి షణ్మత స్థాపకాచార్యునిగా నేటి హిందూమతానికి ఒకానొక రూపకర్తగా నిలిచారు. అఖండ భారతంలో ఎన్నో వేలమైళ్ల పాదయాత్రలు సాగించి వివిధమైన దేవాలయాల్లో మార్పులు చేసి, పూరి, బదరీనాథ్, ద్వారక, శృంగేరీ, కంచిల్లో పీఠాలు స్థాపించి నేటి శంకరాచార్య వ్యవస్థలకు ఆద్యునిగా నిలిచారు. ఇదే క్రమంలో ఆయన బ్రహ్మసూత్రాలకు, భగవద్గీతకు, ఉపనిషత్తులకు, విష్ణుసహస్రనామాలకు భాష్యాలు రచించి, ఎన్నో వందల కొలదీ స్తోత్రాలు చేశారు. ఆయన సృష్టించిన ఆధ్యాత్మిక సాహిత్యాన్ని నిర్వికల్పానంద స్వామి తెనిగించి ఈ గ్రంథం ద్వారా ప్రచురించారు. అత్యంత ప్రభావశీలుడైన ఆధ్యాత్మిక శక్తి ఆదిశంకరుడు ఆయన అందించిన సాహిత్యానికి తెలుగు అనువాదం ఎందరో భక్తులకు ఉపకరిస్తుంది.

మొదటి భాగం[మార్చు]

  • అద్వైతానుభూతి
  • ఆత్మానాత్మ శ్రీవిగర్హణ ప్రకరణము
  • ఆత్మషట్కము (ఆత్మపంచకము, అద్వైతపంచకము, అద్వైతపంచరత్నము)
  • ఆత్మపూజ (పరపూజ)
  • ఆత్మబోధ
  • ఏకశ్లోకి
  • కాశీపంచకము
  • కేవలోహము
  • కౌపీనపంచకము
  • గుర్వష్టకము
  • చర్పటపంజరిక - 1 (భజగోవిందము)
  • చర్పటపంజరిక - 2 (మోహముద్దరము)
  • చర్పటపంజరిక - 3 (అధికశ్లోకాని)
  • జీవన్ముక్తానందలహరి
  • తత్త్వోపదేశము
  • ధన్యాష్టకము
  • నిరంజనాష్టకము
  • నిర్వాణషట్కము
  • నిర్వాణదశకము (దశశ్లోకి, సిద్ధాంతబిందువు)
  • నిర్వాణమంజరి
  • నిర్గుణమానసపూజ
  • ప్రాతఃస్మరణ
  • ప్రశ్నోత్తర-రత్నమాలిక
  • ప్రశ్నోత్తర-మణిరత్నమాల
  • ప్రౌఢానుభూతి
  • బ్రహ్మజ్ఞానావలీమాల
  • బ్రహ్మానుచింతనము (ఆత్మానుచింతనము)
  • మనీషాపంచకము
  • మాయాపంచకము
  • మఠామ్నాయము
  • యోగతారావలి
  • వాక్యవృత్తి
  • లఘువాక్యవృత్తి
  • వాక్యసుధ
  • విజ్ఞాననౌక (స్వరూపానుసంధానము)
  • వేదాంతడిండిమము
  • సదాచారము (సదాచార ప్రకరణము)
  • సాధనపంచకము (ఉపదేశపంచకము)
  • సారతత్త్వోపదేశము
  • స్వాత్మప్రకాశిక
  • హస్తామలకము

మూలాలు[మార్చు]