శకుంతల పాండా
స్వరూపం
శకుంతల పాండా | |
---|---|
పుట్టిన తేదీ, స్థలం | [1] కటక్, ఒడిశా, భారతదేశం | 1939 నవంబరు 10
మరణం | 2017 ఫిబ్రవరి 14[2] | (వయసు 77)
వృత్తి | సంపాదకురాలు, నవలా రచయిత, కథా రచయిత, కవి |
జాతీయత | భారతీయురాలు |
కాలం | పోస్ట్ కలోనియల్ |
పురస్కారాలు | ఉత్కళ భారతి కుంతల కుమారి పురస్కారం |
జీవిత భాగస్వామి | హరిహర్ పాండా[3] |
సంతానం | సుస్మిత బాగ్చి [4] |
బంధువులు | సుబ్రోతో బాగ్చి, (అల్లుడు) |
శకుంతల పాండా (1939 నవంబరు 10 - 2017 ఫిబ్రవరి 14) ఒడియా భాషకు చెందిన భారతీయ రచయిత్రి.[5] ఆమె చాలా ప్రసిద్ధ గణిత ఉపాధ్యాయుడు దివంగత నారాయణ పతి కుమార్తె. ఆమె 15 కవితా పుస్తకాలు, చిన్న కథలు, ప్రయాణ కథనాలను ప్రచురించింది. ఆమె ఒడియా మహిళల నెలవారీ సుచరిత వ్యవస్థాపకురాలు, సంపాదకురాలు కూడా. ఆమె ఒడియాలొ పిల్లల మాసపత్రిక నందనకనన్ కు సంపాదకురాలిగా కూడా పనిచేసింది.[6]
జీవితచరిత్ర
[మార్చు]ఆమె 1975లో ఒడియాలో ఒక మహిళా పత్రికను స్థాపించి, 28 సంవత్సరాల పాటు కృషి చేసింది. ఆమె పిల్లల మాసపత్రిక నందన్కానన్ కు కూడా సంపాదకత్వం వహించింది. ఆమె 15 పుస్తకాలను ప్రచురించింది. ఆమె నేషనల్ బుక్ ట్రస్ట్, కేంద్ర సాహిత్య అకాడమీలలో ఒడియా సలహా కమిటీలో సభ్యురాలిగా ఉంది. ఆమె ఒడియా ఫిల్మ్ సెన్సార్ బోర్డులో సభ్యురాలిగా కూడా వ్యవహరిస్తుంది.
మూలాలు
[మార్చు]- ↑ Ghose, A. (1977). Who's who of Indian women, international. Who's who of Indian Women, International. National Biographical Centre. Retrieved 2020-03-31.
- ↑ "Editor of 'Sucharita' Sakuntala Panda no more". OdishaSunTimes.com. 2017-01-14. Retrieved 2020-03-31.
- ↑ Pioneer, The (2020-03-31). "Sakuntala Memorial reading room opened". The Pioneer. Retrieved 2020-03-31.
- ↑ Basu, Soma (2015-08-13). "The sway of her Pen". The Hindu. Retrieved 2020-03-31.
- ↑ Paṇḍā, Śakuntalā. "Paṇḍā, Śakuntalā [WorldCat.org]". WorldCat.org (in లాటిన్). Retrieved 2020-03-31.
- ↑ Mahanti, J.; Mahānti, J.; Oḍiśā Sāhitya Ekāḍemī (1993). Children's Literature of Orissa. Orissa Sahitya Akademi. Retrieved 2020-03-31.