శనిత్రయోదశి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

శని త్రయోదశి - శనివారం రోజులో వచ్చే త్రయోదశి శనిత్రయోదశి అంటరు. శనిత్రయోదశి నాడు శనీశ్వరుడికి తైలంతో ఇక్కడ అభిషేకం చేస్తారు. నల్లటి వస్త్రాలు దానం చేస్తారు. కోర్టు కేసులు, శత్రువులు, రోగాలు, రుణాలు నుంచి విముక్తుల్ని చేయాల్సిందిగా మొక్కుకుని, వారి కోర్కెలు తీరిన తరువాత మొక్కులు చెల్లిస్తుంటారు.శనీశ్వరుడి ఆలయం నుంచి బయటికి వెడుతూ వెనక్కు తిరిగి చూడకూడదని, వెనక్కు తిరిగి చూస్తే శని దోషం మళ్ళీ చుట్టుకుంటుందని ఇక్కడి పూజారులు భక్తుల్ని పదే పదే హెచ్చరిస్తూంటారు.

త్రయోదశి వ్రతం

[మార్చు]
  • త్రయోదశి వ్రతం శనివారంతో కుడిన ఒక శుక్ల త్రయోదశితో ప్రారంభించి, ఏడాది పొడుగునా శనివారాలు మాత్రమే పడే త్రయోదశి గాని లేదా 24 శుక్ల పక్ష త్రయోదశులు గాని ఎన్నుకొని నియమబద్ధంగా త్రయోదశి వ్రతాచరణ చేయవచ్చును. ప్రదోషకాలంలో శివపూజ, నక్తభోజనం విధులు. సూర్యాస్తమయం తర్వాత ఆరు ఘడియల కాలం వరకు త్రయోదశి ఉండాలి.