శబ్బాష్‌రా శంకరా
శబ్బాష్‌రా శంకరా | |
కృతికర్త: | తనికెళ్ళ భరణి |
---|---|
ముఖచిత్ర కళాకారుడు: | రమణ జీవి |
దేశం: | భారతదేశం |
భాష: | తెలుగు |
ప్రక్రియ: | కవితా సంకలనం |
విభాగం (కళా ప్రక్రియ): | తత్త్వాలు |
ప్రచురణ: | |
విడుదల: |
శబ్బాష్‌రా శంకరా ప్రముఖ సినీనటుడు, సాహిత్యకారుడు తనికెళ్ళ భరణి రాసిన కవితల సంకలనం. శబ్బాష్‌రా శంకరా మకుటంగా రాసిన శివ తత్త్వాలు ఈ సంకలనం రూపంగా ప్రచురించారు. ఈ శివతత్త్వాలను సీడీగా శ్రవ్యరూపంలో కూడా అందించారు తనికెళ్ళ భరణి.
రచన నేపథ్యం
[మార్చు]స్వతాహాగా శివభక్తుడైన సాహిత్యకారుడు, సినీనటుడు తనికెళ్ల భరణి గతంలో ఆట గదరా శివా! పేరిట శివతత్త్వాలను రచన చేసి ప్రచురించడమే కాక, ఎన్నో శైవక్షేత్రాల్లో ఆలపించి భక్తులకు వినిపించారు. ఆ క్రమంలోనే శైవసాహిత్యంలో ప్రాంతీయమైన మాండలికాల్లో(యాసల్లో) శివస్తుతి చేసిన దాఖలాలు లేకపోవడం గమనించి తెలంగాణా మాండలికంలో శబ్బాష్‌రా శంకరా తత్త్వాలు రచన చేయడం ప్రారంభించారు. సినీ హాస్యనటుడు బ్రహ్మానందం, దర్శకులు కె.విశ్వనాథ్, పూరీ జగన్నాథ్, గాయకుడు బాలసుబ్రహ్మణ్యం తదితరులు తత్త్వాలు రచన చేస్తున్నప్పుడే విని ప్రోత్సహించారు. మే 2011లో శబ్బాష్‌రా శంకరా తత్త్వాలను పుస్తకంగా, సీడీగా విడుదల చేశారు.
అంకితం
[మార్చు]బతుకుని ఉత్సవం చేసుకుంటూ అన్ని రంగుల్నీ తనలో లయించుకునే ఆత్మబంధువు ప్రకాష్ రాజ్‌కి అకారణంగా అంటూ ఈ పుస్తకాన్ని అంకితమిచ్చారు భరణి. శబ్బాష్‌రా శంకరా సీడీని ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యంకు అంకితం చేశారు.
కవితా వస్తువులు
[మార్చు]శబ్భాష్‌రా శంకరాలోని కవితా వస్తువులన్నీ శివభక్తి సంబంధమైనవి.