శివరాజు సుబ్బమ్మ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శివరాజు సుబ్బమ్మ

శివరాజు సుబ్బమ్మ (1873 - 1948) ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధురాలు.[1]

ఈమె 1873 సంవత్సరం వెలిచేరు కరణం గారింట్లో జన్మించింది. ఈమె రాజమండ్రిలో శాసనోల్లంఘనోద్యమం (1932) లో పాల్గొని 6 నెలలు వెల్లూరులో జైలుశిక్షను అనుభవించారు. జైలులో స్త్రీఖైదీలకు సత్సంగ కార్యక్రమాలు నిర్వహించేవారు.

ఈమె లక్ష్మీనారాయణను వివాహం చేసుకొన్నారు. వీరికి ఇద్దరు కుమారులు మరియు ఒక కుమార్తె. పెద్దకొడుకు డాక్టరు వెంకటరామారావు స్వాతంత్ర్య సమరయోధుడు, మునిసిపల్ కౌన్సిలర్. జాతీయ పాఠశాలను కార్యదర్శిగా చాలాకాలం నిర్వహించారు.

ఈమె 1948లో పరమపదించారు.

మూలాలు[మార్చు]