శివలెంక రాధాకృష్ణ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

శివలెంక రాధాకృష్ణ ఆంధ్రపత్రిక నిర్వహణ సంపాదకులు. 'ఆంధ్రపత్రిక' వ్యవస్థాపకులు దేశోద్ధారక నాగేశ్వరరావు పంతులు ఆశయాలను, ఆకాంక్షలను సఫలం చేస్తూ ఆంధ్రపత్రిక, సచిత్రవారపత్రిక, భారతి పత్రికలకు సంపాదకత్వ బాద్యతలను ఎంతో సమర్థవంతంగా నిర్వహించాడు.

దేశోద్ధారక నాగేశ్వరరావు పంతులు గారికి శివలెంక శంభు ప్రసాద్ మేనల్లుడు, అల్లుడుకూడా. నాగేశ్వరరావుగారి కుమార్తెతో శంభుప్రసాద్‌ వివాహం 1929లో విజయవాడలో జరిగింది. ఆయనకు ఇద్దరు కుమారులు-రాధాకృష్ణ, నాగేశ్వరరావు, ముగ్గురు కుమార్తెలు, 1972 లో శంభూప్రసాద్‌ మరణించిన అనంతరం పెద్ద కుమారుడు శివలెంక రాధాకృష్ణ ఆంధ్రపత్రిక సంపాదక బాధ్యతలు చేపట్టి ఆ పత్రిక మూసేసే వరకు సంపాదక బాధ్యతలు నిర్వహించారు. రాధాకృష్ణగారు వితరణశీలి. విజయవాడ ప్రెస్‌క్లబ్‌ మొదటి అంతస్తు నిర్మాణానికి లక్షరూపాయలు విరాళం అందచేసి దాతృత్వాన్ని చాటుకున్నారు.

మూలాలు

[మార్చు]