శివానంద్
స్వామి శివానందా | |
---|---|
జననం | శివానంద 8 ఆగష్టు1896 సిల్హేట్ జిల్లా, బెంగాల్ ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా (ప్రస్తుత - రోజు) సిల్హేట్ డివిజన్, బంగ్లాదేశ్) |
జాతీయత | భారతీయుడు |
బిరుదులు/గౌరవాలు | పద్మశ్రీ |
బాబా శివానంద్‌జీ భారతదేశానికి చెందిన యోగ గురువు. ఆయన 2022లో భారత ప్రభుత్వ అత్యున్నత పురస్కారం పద్మశ్రీ అందుకున్నాడు. శివానంద దేశ చరిత్రలో అత్యంత ఎక్కువ వయసులో పద్మ అవార్డు గ్రహీతగా రికార్డులకెక్కాడు .[1]
జీవిత చరిత్ర
[మార్చు]శివానంద 1896 ఆగస్టు 8న నేటి బంగ్లాదేశ్‌లోని సిల్హేట్ జిల్లాలో జన్మించాడు. ఆయన ఆరేండ్ల వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయిన అతడిని గురు ఓంకారానంద గోస్వామి పెంచాడు. శివానంద్ దాదాపు మూడు దశాబ్దాలపాటు గంగానది ఒడ్డున యోగా శిక్షణను ఇచ్చాడు. ఆయన వారణాసి, పూరి, హరిద్వార్, నవద్వీప్ కేంద్రాలుగా దాదాపు 50 సంవత్సరాలకు పైగా 400 - 600 మంది వరకు కుష్టి రోగులకు సహాయ కార్యక్రమాలు నిర్వహించాడు.
దినచర్య
[మార్చు]స్వామి శివానంద రోజూ మూడు గంటలకే లేచి, కాలకృత్యాలు తీర్చుకొని అరగంటపాటు యోగా చేసి తరువాత స్నానం పూర్తి చేసుకొని పూజ చేస్తాడు. ఆ తర్వాత అతడి వద్దకు వచ్చేవారితో మాట్లాడి వారికీ యోగా చేయడం ద్వారా వచ్చే ప్రయోజాలను వివరించి యోగా సాధన చేసేలా వారిని ప్రోత్సహిస్తాడు. ఆయన ఉదయం గోరువెచ్చని నీరు, రెండు రొట్టెలు, ఒక కాయగూర అల్పాహారంగా తీసుకుంటాడు. సాయంత్రం ఉడకబెట్టిన పదార్థాలను ఆహారంగా తీసుకొని రాత్రి 8 గంటలకల్లా నిద్ర పోతాడు.[2]
పురస్కారాలు
[మార్చు]- 2019లో ‘యోగా రత్న’ పురస్కారం
- 2019లో బసుంధర రతన్ అవార్డు[3]
- స్వామి శివానంద 125 ఏళ్ల వయసులో యోగా శిక్షణకు, ఆయన కుష్ఠు రోగులకు చేసిన సేవలకు గాను 2022 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించగా ఆయన 2022 మార్చి 21న పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నాడు.[4][5][6][7]
మూలాలు
[మార్చు]- ↑ HMTV (22 March 2022). "పద్మశ్రీ అందుకున్న యోగా గురువు స్వామి శివానంద". Archived from the original on 3 April 2022. Retrieved 3 April 2022.
- ↑ Eenadu (31 March 2022). "యోగా.. మితాహారం". Archived from the original on 3 April 2022. Retrieved 3 April 2022.
- ↑ TV5 News (22 March 2022). "ప్రధాని మోదీకి పాదాభివందనం చేసిన 125 ఏళ్ల యోగా గురువు.. వీడియో వైరల్." (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2022. Retrieved 3 April 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ TV9 Telugu (23 March 2022). "కుష్టు రోగులకు సేవ.. పద్మశ్రీ అందుకున్న 125 ఏళ్ల స్వామి శివానంద.. వీడియో వైరల్". Archived from the original on 3 April 2022. Retrieved 3 April 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Namasthe Telangana (3 April 2022). "సాత్వికాహారమే శివానందం!". Archived from the original on 3 April 2022. Retrieved 3 April 2022.
- ↑ TV5 News (22 March 2022). "వయసు 125 ఏళ్ళు... ఆయిల్ లేని ఫుడ్.. శివానంద దీర్ఘాయువు రహస్యాలివే" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2022. Retrieved 3 April 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Eenadu (22 March 2022). "మోదీకి పాదాభివందనం చేసి.. పద్మశ్రీ అందుకున్న 125ఏళ్ల యోగా గురువు". Retrieved 3 April 2022.
{{cite news}}
:|archive-date=
requires|archive-url=
(help)