Coordinates: 17°03′11″N 82°10′10″E / 17.0531°N 82.1695°E / 17.0531; 82.1695

శివ పార్వతుల ఆలయం (అనపర్తి)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శివ పార్వతుల ఆలయం
శివ పార్వతుల ఆలయం is located in Andhra Pradesh
శివ పార్వతుల ఆలయం
శివ పార్వతుల ఆలయం
ఆంధ్రప్రదేశ్ లొ ఆలయ ఉనికి
భౌగోళికాంశాలు :17°03′11″N 82°10′10″E / 17.0531°N 82.1695°E / 17.0531; 82.1695
పేరు
ప్రధాన పేరు :శివ పార్వతుల ఆలయం
ప్రదేశం
దేశం:భారత దేశం
రాష్ట్రం:ఆంధ్ర ప్రదేశ్
జిల్లా:తూర్పు గోదావరి
ప్రదేశం:అనపర్తి
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:శివ పార్వతుల ఆలయం
నిర్మాణ శైలి, సంస్కృతి
దేవాలయాలు మొత్తం సంఖ్య:ఒకటి

శివ పార్వతుల ఆలయం తూర్పు గోదావరి జిల్లా, అనపర్తి లో ఉంది. ఆలయ పైభాగంలో ముందు వైపున కూడా చిన్న చిన్న శిల్పాలు వున్నాయి.

ఆలయ చరిత్ర[మార్చు]

పూర్వం ఈ గ్రామంలో ఒక వ్యక్తి సారా వ్యాపారం భారీఎత్తున సాగించేవాడు. అది నిరంతరం సాగుతున్నా అతనికి ఎలాంటి తృప్తి వుండేది కాదు. ప్రస్తుతం ఆలయ ప్రదేశంలో అప్పట్లో ఒకరేగి చెట్టు వుండేది. ఒకనాడు ఒకసాధువు ఆ ప్రాంతానికి వచ్చి ఆ రాత్రి రేగి చెట్టు దగ్గర మకాం చేశాడు. తెల్లవారేసరికి ఆ సాధువు లేడు కానీ ఆ రేగిచెట్టు ముందు అమ్మవారి ఫోటో ఒకటి పెద్దది పెట్టివుంది. ఆ రాత్రే గ్రామంలో ఉన్న సారా వ్యాపారికి పార్వతి అమ్మవారు కలలో కన్పించి అతను చేస్తున్న వ్యాపారం- మానెయ్యమని, తనని సేవిస్తూ వుండమని అతనికి శుభంకలుగుతుందని చెప్పి అదృశ్యమయింది. ఆనాటితో అతను తను చేస్తున్న సారా వ్యాపారాన్ని పూర్తిగా వదిలిపెట్టి, అక్కడ చిన్న మందిరంలాంటిదాన్ని నిర్మించి, సాధువు వదిలిపెట్టిన అమ్మవారి పఠాన్ని అందులో ఉంచి పూజలు చేసుకుంటూ ఉండిపోయాడు. క్రమంగా భక్తులు ఆ దేవాలయానికి రావడం ప్రారంభించారు. అమ్మవారికి ఏదయినా మొక్కుకుంటే అది నెరవేరడంతో భక్తుల సంఖ్య క్రమంగా పెరగడం ప్రారంభమయింది. భక్తుల చందాలతో అమ్మవారి విగ్రహాన్ని కడురమ్యంగా, నేర్పరి అయిన శిల్పులతో చేయించి పెద్దల సమక్షములో ఆలయంలో ప్రతిష్టించారు. [1]

ఉత్సవాలు[మార్చు]

ఈ ఆలయం లో ఈ శివపార్వతుల దేవీనవరాత్రులు,మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా చేస్తారు.

మూలాలు[మార్చు]

  1. నాగిరెడ్డి, ఎన్. ఎస్. తూర్పు గోదావరి జిల్లాలో ప్రసిద్ధ దేవాలయాలు. 2003.