శిష్టా వేంకట సీతారామ శాస్త్రి
స్వరూపం
ఎస్. వి. సీతారామశాస్త్రి గా ప్రసిద్ధిచెందిన శిష్టా వేంకట సీతారామ శాస్త్రి వ్యవసాయరంగ ప్రముఖుడు. వీరి శాస్త్రపరిశోధనలకు గాను పద్మశ్రీ ని పొందారు.[1]
వీరు గుంటూరు జిల్లాకు చెందినవారు. కటక్ లో పరిశోధకులుగా వృత్తిజీవితాన్ని ప్రారంభించి క్రొత్తఢిల్లీలోని భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థలో ప్రొఫెసరుగా ఎదిగారు. తదనంతరం పూనాలోని వరి పరిశోధనా సంస్థలో పరిశోధకునిగా ప్రాజెక్టు కో-ఆర్డినెటర్ గా వరివంగడాలపై విశేషమైన కృషిచేశారు. వీరు నైజీరియా, ఎఫ్.ఎ.ఓ., మనీలా లలో పదవీ బాధ్యతలు నిర్వహించారు.
అవార్డులు
[మార్చు]- 1971 లో పద్మశ్రీ అవార్డు[2]
- 1975 లో బోర్లోగ్ అవార్డు
- వెంకటరెడ్డి బహుమతి
మూలాలు
[మార్చు]- ↑ డా. ఆర్. అనంత పద్మనాభరావు (2000). ఢిల్లీ ఆంధ్ర ప్రముఖులు. హైదరాబాదు: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం. p. 161.
- ↑ "Padma Awards Directory (1954–2014)" (PDF). Ministry of Home Affairs (India). 21 May 2014. pp. 37–72. Archived from the original (PDF) on 15 నవంబరు 2016. Retrieved 24 ఆగస్టు 2020.