శుక్లము

వికీపీడియా నుండి
(శుక్లం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
Cataract
వర్గీకరణ & బయటి వనరులు
Magnified view of cataract in human eye, seen on examination with a slit lamp using diffuse illumination
m:en:ICD-10 {{{m:en:ICD10}}}
m:en:ICD-9 {{{m:en:ICD9}}}
DiseasesDB 2179
m:en:MedlinePlus 001001

చూపు కొద్దిగా మందగిస్తుంది. అక్షరాలు మసగ్గా కనబడటం ప్రారంభిస్తాయి. మన కంట్లో ఒక కటకం (Lens) ఉంటుంది. అది ఒక సంచిలా ఉంటుంది. బయటి నుంచి వచ్చే కాంతి కిరణాలు ఈ కటకం ద్వారా వెళ్లి లోపల ఉండే రెటీనా మీద పడతాయి. అప్పుడే మనం దేన్నైయినా చూడగలుగుతాం. వయసు పైబడుతున్నప్పుడు కంట్లోని కండరాలు బిగుసుకుపోతాయి. కటకం తన సహజమైన మృదుత్వం కోల్పోయి గట్టిపడుతుంది. కటకానికి సంబంధించిన ప్రొటీన్లలో వచ్చిన కొన్ని రసాయనిక మార్పుల వల్ల కటకం మీద మచ్చలు ఏర్పడతాయి. ఈ స్థితినే శుక్లాలు (Cataract) అంటారు. ఈ శుక్లాల కారణంగా కిరణాలు లోనికి వెళ్లలేవు. ఫలితంగా చూపు మందగిస్తుంది. కొందరికి దగ్గరి చూపు మందగిస్తే మరికొందరిలో దూరం చూపు మందగించవచ్చు.

లక్షణాలు

[మార్చు]

తొలిదశలో మరకలు, మసకతనం కటకం అంచుల్లో మాత్రమే ఉండటం వల్ల కొన్నాళ్ల దాకా చూపులో పెద్ద తేడా రాకపోవచ్చు. క్రమంగా ఆ మచ్చలు పెరిగే కొద్దీ దృష్టి లోపం పెరుగుతూనే ఉంటుంది. అయితే కేవలం క్యాటరాక్ట్ వల్ల చూపు తగ్గడం తప్ప కన్ను ఎర్రబారడం గానీ, కంట్లో నొప్పిగానీ, నీరు కారడం కానీ ఉండదు.

  • వయసే ప్రధానం

మామూలుగా 45 నుంచి 65 ఏళ్ల లోపు వయసులో దాదాపు అందరూ ఈ సమస్యకు గురవుతారు. 95 శాతం మందికి వయస్సు మీద పడటం వల్లే వస్తుంది. మిగిలిన ఐదు శాతం మందికి- ఆహారంలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ప్రొటీన్లు కొరవడటం, ఎక్కువ సమయం కళ్లు సూర్యరశ్మికి గురికావడం, మధుమేహం, పొగతాగడం వంటి కారణాల వల్ల వస్తుంది. కొన్ని అరుదైన కేసుల్లో జన్యుపరమైన కారణాలు, స్టిరాయిడ్స్ వాడటం వల్ల కూడా శుక్లాల సమస్య వస్తుంది.

  • ఒక సారి ఏర్పడితే..

కారణమేదైనా ఒకసారి శుక్లాల సమస్య మొదలయ్యిందీ అంటే అది క్రమంగా పెరుగుతూనే ఉంటుంది. కొందరిలో పెరగడం ఆగిపోవచ్చేమో కానీ, తగ్గడం మాత్రం ఉండదు. కంటికి తగిలిన గాయం కారణంగా వచ్చిన శుక్లాలు మాత్రం ఆ గాయం మానిన తరువాత మెల్లమెల్లగా ఆ శుక్లాలు కూడా తగ్గే అవకాశం ఉంది. అలాగే మధుమేహం కారణంగా కొందరిలో తాత్కాలికంగా శుక్లాలు ఏర్పడితే అవి చక్కెర అదుపులోకి రాగానే కొందరిలో మళ్లీ కనుమరుగైపోవచ్చు. ఇవి తప్ప మిగతా కారణాలతో వచ్చే శుక్లాలేవీ శస్త్ర చికిత్స చేస్తే తప్ప పోవు.

  • ఎలా తెలుస్తుంది ?

పెరిగిన వయసు కారణంగా ఏర్పడిన శుక్లాల ప్రభావం దాదాపు సంవత్సరం దాకా ఏమీ కనిపించదు. శుక్లాలు కంటి చివరల్లో మాత్రమే ఉండడమే దీనికి కారణం. ఏడాది గడిచాక నొప్పేమీ ఉండదు కానీ, చూపు తగ్గడం మొదలవుతుంది. మామూలు వెలుగులో బాగానే ఉన్నా, ఎండలోకి, ఎక్కువ వెలుగులోకి వెళ్లినప్పుడు మాత్రం సరిగా కనిపించదు. కొందరికి పగటిపూట ఏ ఇబ్బందీ ఉండదు.

కానీ, రాత్రివేళ వాహనాల వెలుగులో ఏమీ కనిపించదు. మరి కొందరికి ఒక వస్తువు, లేదా వ్యక్తి రెండు మూడు రూపాల్లో కనిపించవచ్చు. ఇలా కనిపించడాన్ని మల్టిపుల్ పాలియోపియా అంటారు. మరి కొందరికి కన్ను నీరు కమ్మిన భావన కలుగుతుంది. చూపు మసకబారడమే ఇందుకు కారణం. క్యాటరాక్ట్ ఉన్నట్లు తేలిన అందరికీ శస్త్ర చికిత్స చేయవలసిన అవసరం లేదు. రోజువారి కార్యక్రమాలకు ఇబ్బందిగా ఉన్నప్పుడు కళ్ల జోడుతో సమస్యను చాలా వరకు అధిగమించవచ్చు. అయితే ఏ స్థాయి కళ్లజోడు వాడినా చూపు స్పష్టంగా కనిపించనప్పుడు మాత్రం శస్త్ర చికిత్స తప్పనిసరి అవుతుంది.

వైద్యచికిత్స

[మార్చు]

శస్త్ర చికిత్స

[మార్చు]
Cataract surgery, using a temporal approach phacoemulsification probe (in right hand) and "chopper" (in left hand) being done under operating microscope at a Navy medical center

ప్రాచీన ఆయుర్వేదంలో శుశృత సుమారు క్రీ.పూ.6వ శతాబ్దంలో శుక్లాలకు శస్త్రచికిత్స జరిపాడు.[1] భారత దేశంలో ఈ శస్త్ర చికిత్సను ఒక ప్రత్యేక సూదితో చేసేవారు. ఈ సూది చాలా సన్నాగా ఉండి వంకర తిరిగి ఉంటుంది. ఈ సూదిని " జంబుఖి శలాక"గా వ్యవహరించేవారు. ఈ వంకర సూదితో కంటిలోని కటకాన్ని కదిలించి శుక్లాన్ని బయటకు తోశేవారు. ఆ తరువాత కంటిలో వేడి చేసిన వెన్నను ఉంఛి కట్టు కట్టేవారు. ఈ విధానం ఎంతో విజయవంతమైనప్పటికీ, శుశ్రుతుడు చెప్పినట్లు ఈ చికిత్సను అవసరమైనప్పుడు మాత్రమే చెయ్యాలి. పురాతన గ్రీకు వైద్యులు, గ్రీకు వేదాంతులు భారత దేశాన్ని సందర్శించినప్పుడు, వారు ఈ వైద్య విధానాన్ని చూడటం జరిగింది. తద్వారా చైనీయుల సాంప్రదాయక వైద్య విధానంలోకి, భారత దేశానికి చెందిన ఈ వైద్య విధానం ప్రవేశపెట్టబడిందట.

The first references to cataract and its treatment in Ancient Rome are found in 29 AD in De Medicinae, the work of the Latin encyclopedist Aulus Cornelius Celsus.[2] The Romans were pioneers in the health arena - particularly in the area of eye care.[3]

The Iraqi ophthalmologist Ammar ibn Ali of Mosul performed the first extraction of cataracts through suction. He invented a hollow metallic syringe hypodermic needle, which he applied through the sclerotic and extracted the cataracts using suction.[4] In his Choice of Eye Diseases, written in circa 1000, he wrote of his invention of the hypodermic needle and how he discovered the technique of cataract extraction while experimenting with it on a patient.[5]

Rajah Serfoji II (1777-1832), a deposed prince of the Maratha dynasty in the south city of Thanjavur in Tamil Nadu is also believed to have maintained impeccable records of the ocular conditions of his patients. Records show cataract surgeries being performed during his rule in his kingdom.[6]

When a cataract is sufficiently developed to be removed by surgery, the most effective and common treatment is to make an incision (capsulotomy) into the capsule of the cloudy lens in order to surgically remove the lens. There are two types of eye surgery that can be used to remove cataracts: extra-capsular (extracapsular cataract extraction, or ECCE) and intra-capsular (intracapsular cataract extraction, or ICCE).

Extra-capsular (ECCE) surgery consists of removing the lens but leaving the majority of the lens capsule intact. High frequency sound waves (phacoemulsification) are sometimes used to break up the lens before extraction.

Intra-capsular (ICCE) surgery involves removing the entire lens of the eye, including the lens capsule, but it is rarely performed in modern practice.

In either extra-capsular surgery or intra-capsular surgery, the cataractous lens is removed and replaced with a plastic lens (an intraocular lens implant) which stays in the eye permanently.

Cataract operations are usually performed using a local anaesthetic and the patient is allowed to go home the same day. Recent improvements in intraocular technology now allow cataract patients to choose a multifocal lens to create a visual environment in which they are less dependent on glasses. Under some medical systems multifocal lenses cost extra. Traditional intraocular lenses are monofocal.

Complications are possible after cataract surgery, including endophthalmitis, posterior capsular opacification and retinal detachment.

In ICCE there is the issue of the Jack in the box phenomenonమూస:What? where the patient has to wear aphakic glasses - alternatives include contact lenses but these can prove to be high maintenance, particularly in dusty areas.

ఫేకో సర్జరీ

[మార్చు]

నేడున్న ఆధునిక చికిత్సల్లో శుక్లాలు ముదిరేదాకా వేచి ఉండవలసిన అవసరం లేదు. అయితే కళ్లజోడు ద్వారా చూపును పెంచే అవకాశం లేనప్పుడు మాత్రమే ఈ శస్త్ర చికిత్స చేయడం సరియైన విధానం. ఇప్పుడున్న ఆధునిక విధానానికి ఫేకో సర్జరీ (ఫేకో ఎమల్సిఫికేషన్) అని పేరు. ఈ విధానంలో అతి సూక్ష్మమైన సూది (నీడిల్) ద్వారా శుక్లం సమీపంలోనికి అల్ట్రాసోనిక్ ధ్వని తరంగాలను పంపుతారు. వాటి ప్రకంపనాలు శుక్లాల‌ను చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టి ద్రవంగా మార్చి వెలుపలికి లాగేస్తాయి.

ఒకప్పుడు ఈ శస్త్ర చికిత్స చేయడానికి ముందు కన్ను మొద్దుబారేలా కన్ను కింద ఒక ఇంజెక్షన్ ఇవ్వ వలసి వచ్చేది. అలా ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల ఒక్కోసారి నెలల పర్యతం నొప్పి ఉండేది. మరి కొన్ని ఇతర సమస్యలు కూడా వచ్చేవి. దానికి భిన్నంగా ఇప్పుడు కళ్లలో చుక్కల మందు వేయడం ద్వారా కన్ను మెద్దుబార్చే విధానం వచ్చింది. దీన్ని "టాపికల్ అనస్థీషియీ" అంటారు.

ఈ విధానంలో చేసే శస్త్ర చికిత్సలో కోత మూడు మిల్లీ మీటర్లలోపే ఉంటుంది. ఈ ఫేకో సర్జరీలో కంటికి కుట్లు వేసే అవసరం ఉండదు. సర్జరీ కేవలం 15 నిముషాల్లో పూర్తవుతుంది. కుట్లు లేకపోవడం వల్ల కన్ను మీద పట్టీ వేసే అవసరం కూడా ఉండదు. అందుకే శస్త్ర చికిత్స అయిన పది నిముషాల తరువాత ఇంటికి వెళ్లిపోవచ్చు. మరుసటి రోజు వచ్చి పరీక్ష చేయించుకుంటే చాలు .

  • డాక్టర్ మురళీ కృష్ణమాచారి ఆసూరి రచించిన వ్యాసం ఆధారంగా...

నివారణోపాయాలు

[మార్చు]

శుక్లాలు పూర్తిగా రాకుండా చేయడానికి నివారణ సాధ్యంకాదు. సన్ గ్లాస్లు ఉపయోగించి అతినీలలోహిత కిరణాల నుండి రక్షణ కలిగించడం ద్వారా కొంతవరకు శుక్లాల అభివృద్ధిని నియంత్రించవచ్చును.[7][8] ఏంటీ-ఆక్సిడెంట్ పదార్ధాలు (విటమిన్ A, C, E) ఉపయోగపడతాయని భావించినా, శాస్త్రీయ పరిశోధనల ద్వారా ఇవి ఏమీ ఉపయోగపడవని తేలింది.[9]

మూలాలు

[మార్చు]

https://web.archive.org/web/20100223100427/http://www.eenadu.net/specialpages/sp-health.asp?qry=sp-health1

  1. "A short history of cataract surgery". Archived from the original on 2007-09-28. Retrieved 2008-12-09.
  2. "Cataract history". Archived from the original on 2017-05-03. Retrieved 2008-12-09.
  3. The Romans carried out cataract ops, February 9, 2008, BBC News
  4. Ibrahim B. Syed PhD, "Islamic Medicine: 1000 years ahead of its times", Journal of the International Society for the History of Islamic Medicine 2 (2002): 2-9 [7].
  5. Finger, Stanley (1994), Origins of Neuroscience: A History of Explorations Into Brain Function, Oxford University Press, p. 70, ISBN 0195146948
  6. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2009-01-10. Retrieved 2008-12-09.
  7. Epidemiology. 2003 Nov;14(6):707-12. Sun exposure as a risk factor for nuclear cataract
  8. J.C. Javitt, F. Wang and S. K. West, “Blindness Due to Cataract: Epidemiology and Prevention.” Archived 2008-04-06 at the Wayback Machine Annual Review of Public Health 17 (1996): 159-77. Cited in Five-Year Agenda for the National Eye Health Education Program (NEHEP), p. B-2; National Eye Institute, U.S. National Institutes of Health
  9. A randomized, placebo-controlled, clinical trial of high-dose supplementation with vitamins C and E and beta carotene for age-related cataract and vision loss: AREDS report no. 9. Arch Ophthalmol. 2001 Oct;119(10):1439-52

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=శుక్లము&oldid=4138391" నుండి వెలికితీశారు