కళ్ళద్దాలు
కళ్ళద్దాలు లేదా కంటి అద్దాలు (ఆంగ్లం: Spectacles) కంటి ముందు ధరించే అద్దాలు. ఇవి ఎక్కువగా దృష్ఠిదోషమున్న వ్యక్తులు ధరిస్తారు. కొంతమంది బయటి వాతావరణం, అతినీలలోహిత కిరణాల నుండి కళ్ళను రక్షించుకోడానికి కూడా వాడుతున్నారు.
కళ్ళద్దాల ఫ్రేములు ఎక్కువగా లోహాలతోగాని, కొమ్ముతోగాని, ప్లాస్టిక్ తోగాని తయారుచేస్తారు. అద్దాలు ముందుగా గాజుతో తయారుచేసేవారు. బరువు తక్కువగా ఉండి, పగిలి కంటికి ప్రమాదం కలిగించని కారణం చేత, ప్రస్తుతం ఇవి ప్లాస్టిక్తో చేస్తున్నారు. కొన్ని ప్లాస్టిక్ అద్దాలకు అతినీలలోహిత కిరణాలను ఆపగలిగే శక్తి ఎక్కువగా ఉంది.[1]
రకాలు
[మార్చు]దృష్ఠిదోషం కోసం
[మార్చు]ఈ కళ్ళద్దాలు కంటి యొక్క దృష్టిదోషాన్ని సవరిస్తాయి. దూరదృష్టి ఉన్నవారు పుటాకార కటకం, హ్రస్వదృష్టి ఉన్నవారు కుంభాకార కటకం ఉపయోగిస్తారు. అద్దాల శక్తిని డయాప్టర్ లలో కొలుస్తారు.
రక్షణ కోసం
[మార్చు]ఈ కళ్ళద్దాలు వెల్డింగ్ పనిచేసేవారు ధరిస్తారు. ఇవి వెల్డింగ్ కాంతికిరణాలు, ఎగిరే రేణువుల నుండి కళ్ళను రక్షిస్తాయి.
ప్రత్యేకమైనవి
[మార్చు]3 డి సినిమాలు చూడడం కోసం ఒక ప్రత్యేకమైన కళ్ళద్దాలు అవసరమౌతుంది.
సూర్యకాంతి నుండి రక్షణ
[మార్చు]సూర్యకాంతి నుండి రక్షణ కోసం చలువ కళ్ళద్దాలను వాడుతారు. అనేక రకాల బ్రాండ్ల కళ్ళద్దాలు లభిస్తున్నాయి.
చిత్రమాలిక
[మార్చు]-
లెన్సు
-
రంగుల లెన్సులు
-
లెన్సు
-
కాంటాక్ట్ లెన్సులు
మూలాలు
[మార్చు]- ↑ DeFranco, Liz (April 2007). "Polycarbonate Lenses: Tough as Nails". All About Vision. Archived from the original on 2007-09-28. Retrieved 2007-09-01.
బయటి లింకులు
[మార్చు]- Antique Spectacles Archived 2021-06-01 at the Wayback Machine, extensive history and pictures of spectacles.
- British Optical Association Museum, Spectacles Gallery