Jump to content

శృతి పెరియస్వామి

వికీపీడియా నుండి
శృతి పెరియస్వామి
జననం
సురుతి పెరియసామి

(1995-11-24) 1995 నవంబరు 24 (వయసు 29)
సేలం, తమిళనాడు, భారతదేశం
ఇతర పేర్లుసురుతి పెరియసామి
విద్యాసంస్థభారత్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్
వృత్తి
  • నటి
  • మోడల్
క్రియాశీల సంవత్సరాలు2021 – ప్రస్తుతం

శృతి పెరియస్వామి (ఆంగ్లం: Suruthi Periyasamy; 1995 నవంబరు 24) భారతీయ నటి, మోడల్. ఆమె ప్రధానంగా తమిళ భాషా చిత్రాలలో పనిచేస్తుంది.[1] ఆమె రియాలిటీ టెలివిజన్ షో బిగ్ బాస్ తమిళ సీజన్ 5లో కంటెస్టెంట్‌గా అరంగేట్రం చేసింది.[2] 2022లో, ఆమె తన మొదటి చిత్రం నందన్ చిత్రంలో నటుడు ఎం. శశికుమార్‌తో కలిసి నటించింది.[3]

వాళ్వు తొడంగుమిడం నీదానే అనే చిత్రంలో నిరంజన నైదియర్‌తో కలసి లెస్బియన్ గా నటించి మెప్పించింది. ఈ చిత్రం ఓటీటీలో విడుదలై సెన్సేషన్‌ని క్రియేట్ చేస్తోంది.[4]

బాల్యం, విద్యాభ్యాసం

[మార్చు]

తమిళనాడులోని సేలంలో 1995 నవంబరు 24న మధ్యతరగతి కార్మిక కుటుంబంలో ఆమె జన్మించింది. తన మాధ్యమిక పాఠశాల విద్యను సేలంలోని హోలీ ఏంజెల్స్ పాఠశాలలో పూర్తి చేసింది, తర్వాత ఆమె భరత్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ యూనివర్శిటీలో చేరింది. అక్కడ, ఆమె పెర్ఫార్మింగ్ ఆర్ట్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ పట్టా పుచ్చుకుంది.

కెరీర్

[మార్చు]

తన కెరీర్‌ని మోడల్‌గా ప్రారంభించింది. 2019లో, ఆమె ఫెమినా మిస్ ఇండియా 2019 కోసం ఆడిషన్ చేయబడింది. ఆ తర్వాత తమిళనాడుకు ప్రాతినిధ్యం వహిస్తున్న స్టేట్ ఫైనలిస్ట్‌గా ఎంపికైంది.[5] మరుసటి సంవత్సరం, ఆమె మిస్ దివా 2020లో మోడల్‌గా ఆడిషన్ చేయబడింది, అక్కడ ఆమె టాప్ 20లో నిలిచింది.[6]

2021లో, స్టార్ విజయ్‌లో ప్రసారమైన రియాలిటీ షో బిగ్ బాస్ తమిళం సీజన్ 5తో ఆమె టెలివిజన్ అరంగేట్రం చేసింది. అక్కడ ఆమె కంటెస్టెంట్‌గా పాల్గొంది, అయినప్పటికీ ఆమె 35వ రోజున షో నుండి తొలగించబడింది.[7][8] 2022లో, ఆమె బిగ్ బాస్ అల్టిమేట్ సీజన్ 1 పేరుతో బిగ్ బాస్ స్పిన్-ఆఫ్ వెర్షన్‌కు తిరిగి వచ్చింది.[9] మరోసారి పోటీదారుగా పాల్గొంది. ఆ సంవత్సరం తరువాత, దర్శకుడు ఎరా శరవణన్, నటుడు ఎం. శశికుమార్‌తో కలిసి నటించిన నందన్ చిత్రంలో ప్రధాన మహిళా పాత్రను పోషించి సినిమారంగంలో అడుగుపెట్టింది.[10] 2023లో, ఆమె వాఙ్వు తొడంగుమీద నీతానే చిత్రంలో లెస్బియన్ పాత్రలో నటించింది.[11]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

తన తల్లి కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల, తండ్రి వయసు ఉండి పెళ్ళై ఐదుగురు పిల్లలున్న వ్యక్తిని వివాహం చేసుకుంది. శృతి పెరియస్వామి 11 సంవత్సరాల వయసులో తన తండ్రి చనిపోయాడు.[12]

మూలాలు

[మార్చు]
  1. "സുറുതി പെരിയസാമി - Suruthi Periyasamy". manoramaonline.com. 24 September 2022. Retrieved 25 May 2023.
  2. "The first thing I learnt was to speak for myself: Suruthi Periyasamy". The Times of India. 7 October 2021. Retrieved 29 April 2022.
  3. "Sasikumar-Era Saravanan's film titled Nandhan". dtnext.in. 30 November 2022. Archived from the original on 7 March 2023. Retrieved 7 March 2023.
  4. "Suruthi and Niranjana: లెస్బియన్లుగా శృతి - నిరంజన నటించిన చిత్రం ఓటీటీలో దున్నేస్తోంది | Vaazhvu Thodangumidam Neethanae Creates Sensation in OTT KBK". web.archive.org. 2023-12-23. Archived from the original on 2023-12-23. Retrieved 2023-12-23.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  5. "Suruthi Periyasami's introduction at Miss India 2019 Tamil Nadu audition". The Times of India. 6 February 2019. Archived from the original on 25 మే 2023. Retrieved 25 May 2023.
  6. "Meet the stunning LIVA Miss Diva 2020 Finalists". filmfare.com. 4 February 2020. Retrieved 25 May 2023.
  7. "Suruthi Periyasamy apologizes to fans in first video after 'Bigg Boss 5' eviction". indiaglitz.com. 9 November 2021. Retrieved 25 May 2023.
  8. "'Bigg Boss 5' Suruthi's photo as black goddess Lakshmi goes viral". indiaglitz.com. 7 October 2021. Retrieved 25 May 2023.
  9. "Suruthi walks out of Bigg Boss house! But not with an empty hand". indiaglitz.com. 1 April 2021. Retrieved 25 May 2023.
  10. "Sasikumar paired opposite Bigg Boss fame Suruthi Periyasamy in film "Nandhan"". The Times of India. 30 November 2022. Retrieved 25 May 2023.
  11. "'Bigg Boss' fame Suruthi Periyasamy's lesbian love story 'Vaazhvu Thodangumidam Neethanae' FL out". indiaglitz.com. 13 February 2023. Retrieved 25 May 2023.
  12. ""I felt happy when my father died" - Bigg Boss Suruthi's shocking statement". indiaglitz.com. 7 October 2021. Retrieved 25 May 2023.