శేఖర్ బాషా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Shekar Basha
గుదిమెళ్ల రాజశేఖర్
జననం
Gudimella Raja Sekhar
వృత్తిActor, director, television presenter, radio jockey
క్రియాశీల సంవత్సరాలు2005–present
ఎత్తు5 ft 9 in (175 cm)
పురస్కారాలుIndia Radio Forum's "RJ of the Year 2017" and 19 more.

"శేఖర్ బాషా" en: Shekar Basha ఒక ఆర్జేగా (రేడియో జాకీ) [1][2][3], వీజే గా (టీవీ యాంకర్) మరియ క్రీడా వ్యాఖ్యాత గా (క్రికెట్ కామెంటేటర్) తెలుగు ప్రజలకి సుపరిచితుడే[4][5]. ఇతను హైదరాబాద్ లోని 92.7 బిగ్ ఎఫ్ఎంలో రోజు సాయంత్రం 5 గంటలకు ప్రసారమయ్యే "కిక్ " కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటాడు, అలానే టీవీ రంగంలో ఒక దశాబ్దం పాటు జెమినీ మ్యూజిక్, మా మ్యూజిక్ టీవీ ఛానల్ లలో వీజేగా వ్యవహరించాడు. ఇటీవల జరిగిన 2019 ఇండియా-వెస్ట్ఇండీస్ క్రికెట్ సీజన్ కి క్రీడా వ్యాఖ్యాతగా వ్యవహరించాడు (కామెంటేటర్). భారతదేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన రేడియో అవార్డు "ఎక్సలెన్స్ ఇన్ రేడియో" ఐఆర్ఎఫ్ పురస్కారాన్ని ఇతను 19 సార్లు గెలుచుకున్నాడు, ఈ ఘనత సాధించిన ఏకైక భారతీయ ఆర్జే "శేఖర్ బాషా "[6][7][8][9].[10][11][12] 2019 సంవత్సరానికి గాను ఇండియా రేడియో ఫోరమ్ వారి నుంచి "ఉత్తమ రేడియోజాకీ" పురస్కారాన్ని కూడా శేఖర్ బాషా గెలుచుకోవడం జరిగింది.[13][14][15][16][17] ఆంగ్ల దినపత్రిక "ది టైమ్స్ ఆఫ్ ఇండియా" నిర్వహించిన ఒక సర్వే ప్రకారం, టీవీ మటియు రేడియో రంగాలలో అత్యంత ప్రభావితం చేసిన వ్యక్తులలో మొదటి 10 స్థానాల్లో నిలిచాడు (10 most desirable men in 2017 in TV & Radio). టీవీ రంగంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని టన్నుల ప్రశంసలు అందుకున్న అసలు సిసలైన రేడియో గురువు "శేఖర్", ఎంట్టైన్మెంట్ కి కింగ్ గా నిరూపించుకున్నాడు, అని టైమ్స్ ఆఫ్ ఇండియా కితాబ్ ఇచ్చింది.[18] 2016 సంవత్సరానికి గాను పద్మ మోహన పురస్కారం వారు అందించే పురస్కారాలలో " ఉత్తమ వీడియో జాకీ" గా ప్రకటించబడ్డాడు[19]

RJ Shekar IRF Award Winning pose

(2005-2007)

2005 ఏప్రిల్ 10 లో తెలుగు జెమిని మ్యూజిక్ ఛానల్ లో వీడియో జాకీ (VJ) గా శేఖర్ తన కెరీర్ ప్రారంబించారు. ఇతను అదే ఛానల్ లో ౩౦౦౦ కి పైగా లైవ్ షోలు నిర్వహించాడు, కానీ పిల్లల థీమ్ గా చేసిన " హాయ్-బుజ్జి" షోలో తన పాత్రకు చాలా ప్రశంసలు అందుకున్నాడు, గురు-శిష్య థీమ్ ఆధారంగా "సండే హమ్ - సందేహం" అనే లైవ్ షో కూడా నిర్వహించాడు.2006 నవంబరులో శేఖర్ రెడ్ ఎఫ్ఎం 93.5 (అప్పుడు ఎస్ ఎఫ్ఎం) లో ఆర్జేగా చేరాడు. ఇతను "తెల్లారిందోయ్ మామ (బ్రేక్ఫాస్ట్ షో)", " గురూ హోజ షురో" (మధ్యాహ్నం బ్యాండ్) షోలకు హోస్ట్ గా చేసాడు.

ఇండియా రేడియో ఫోరమ్ నుండి " గురూ హోజ షురో" షో " 2007 సంవత్సరానికి గాను ఉత్తమ రేడియో కార్యక్రమం" పురస్కారాన్ని గెలుచుకుంది.[20] శేఖర్ "కెవ్వు-కేక"[21] అనే పదాన్ని పరిశ్రమకు పరిచయం చేసాడు, ఈ పధం చాలా మంది ప్రజల ఆదరణ పొందింది, తర్వాత సినిమాలు, టీవీ కార్యక్రమాలకు ఈ పదాన్ని పేరుగా పెట్టారు (అల్లరి నరేష్ సినిమా పేరు "కెవ్వు-కేకే"). అంతేకాకుండా సినిమా పాటలలో కూడా ఈ పదాన్ని ఉపయోగించారు (పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్).

(2007- present) :

2007 ఆగస్టులో శేఖర్ బాషా రెడ్ ఎఫ్ఎం 93.5 నుండి బిగ్ ఎఫ్ఎం 92.7 కి మారాడు. బిగ్ ఎఫ్ఎంలో ఇతను "బిగ్ సందడి" షోకి హోస్ట్ గా చేసాడు, [22] అప్పటివరకు ఈ షో తెలుగు టీవీ యాంకర్, సినీ నటి అయిన "ఝాన్సీ" చేత నిర్వహించబడింది.[23] 2008 మే 27 న, ఐఆర్ఎఫ్ ఈ షోను "ఉత్తమ రేడియో కార్యక్రమం"గా పేర్కొంది. శేఖర్ కు "గుడ్ మార్నింగ్"కి బదులుగా "హ్యాపీ మార్నింగ్"అని చెప్పే అలవాటు. అందుకే 2009 లో ఈ షో కి "హ్యాపీ మార్నింగ్స్" అని పేరు మార్చాడు.2015 లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, "హ్యాపీ మార్నింగ్స్" షోని రాష్ట్ర గౌరవాన్ని ప్రతిబింబించేల "సలా0 తెలంగాణ"గా పేరు మార్చాడు,, ఈ షో "2017 సంవత్సరానికి గాను ఉత్తమ బ్రేక్ఫాస్ట్ షో" పురస్కారాన్ని అందుకుంది.[24] రేడియో, వీడియో జాకీ లతో పాటు, శేఖర్ అవార్డు గెలుచుకున్న ప్రోమోలు, హ్యుమర్ క్యాప్సూల్ స్పార్కర్లను కూడా నిర్మించారు, ఇందులో రేడియో హ్యుమర్ క్యాప్సూల్స్ "కోటిగాడు & రాఉగారు", బిగ్ బాబా, సంగీతం మాస్టార్, గూగుల్ గురూజీ, ఆనందం పరమానందం ఉన్నాయి.

Awards and records :

2007 నుండి 2019 వరకు మొత్తం 18 అవార్డులతో అందరికంటే ఎక్కువ ఐఆర్ఎఫ్ అవార్డులను గెలుచుకుని శేఖర్ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్నిఏర్పరుచుకున్నాడు.[25][26][27][28][29][30][31][32][33] ఉత్తమ వీడియో జాకీ - 2016 జెమినీ మ్యూజిక్ లో "ఎఫ్-క్లబ్" షోకి గాను ఈ పురస్కారం వచ్చింది.[19] సంతోషమ్ సినీ మ్యాగజైన్ " 2014 సంవత్సరానికి గాను ఉత్తమ రేడియో జాకీ". అందుకున్నాడు.[34] ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ నుండి " 2010 సంవత్సరానికి గాను ఉత్తమ యువ ప్రసారకుడిగా(youngest communicator)" పురస్కారాన్ని శేఖర్ అందుకున్నాడు.[35] ఆర్జే కోసం అహ్మదాబాద్ లోని ముద్రా ఇనిస్టిట్యుట్ ఆఫ్ కమ్యూనికేషన్స్ (MICA) లో శిక్షణ పొందాడు.[36]

మారథాన్ :

2018 ఆగస్టు నాటికి శేఖర్ నాలుగు మారథాన్ ఆర్జే ఫీట్స్ నిర్వహించాడు:

1) 2007 సెప్టెంబరులో 92.7 గంటలు నాన్ -స్టాప్ మారథాన్ ని నిర్వహించాడు, తెలుగు రేడియోలో ఇది మొదటి మారథాన్, ఈ మారథాన్ హైదరాబాద్ లో భారీ సంచలనం సృష్టించింది, రేడియో వాడకం మొత్తం హైదరాబాద్ లో పెరగడానికి సహాయపడింది.[37]

2) 2008 ఆగస్టు 12 నుండి 16 వరకు 100 గంటల పాటు మొబైల్ స్టూడియో (ఆన్-వీల్స్) ద్వారా అనగా ఒక క్యాన్టర్ లోకి రేడియో స్టేషన్ ని మార్చి ఆ క్యాన్టర్ తోటి హైదరాబాద్ మొత్తం సంచరిస్తూ రేడియోని ప్రజలకు మరింత దగ్గర చేసాడు. ఈ మారథాన్ యొక్క ముఖ్య ఉద్దేశం "శాంతి-అప్రమత్తత" ఆగస్టు-15 నాడు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తీవ్రవాదుల కుట్ర బగ్నం చెయ్యడానికి ప్రజలు అందరు కూడా తమ తమ వంతు సహకారాన్ని ఎలా అందించాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశం పై వారిలో చైతన్యం తీసుకొచ్చాడు.[38]

3) మరొకసారి 2016 జనవరి 26 ఉదయం 7 నుండి 2016 జనవరి ౩౦ సాయంత్రం 5 గంటల వరకు 106 గంటల "ఆన్-వీల్స్" మారథాన్ ను నిర్వహించాడు. అయితే ఈ సారి మొబైల్ ఇంటర్నెట్ యొక్క సేవలను సద్వినియోగం చేసుకోవడం, దాని ప్రాముఖ్యతను తెలియజేయడమే ఈ మారథాన్ ఉద్దేశం.[39]

4) ఇక నాలుగో మారథాన్ ప్లాస్టిక్ ఉత్పతులను ఉపయోగించడం వాటి వల్ల తలెత్తే పరిస్థితుల పై అవగాహన పెంచడానికి 92 గంటల నాన్-స్టాప్ ఆర్జే మారథాన్ 2018 ఆగస్టు 13 నుండి ఆగస్టు 16 వరకు నిర్వహించారు.[40][41][42][43]

సినిమా తెరంగేట్రం :

ప్రముఖ దర్శకుడు సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన "వెల్కమ్ -ఒబామా" చిత్రంతో శేఖర్ నటుడిగా కెరీర్ ప్రారంబించాడు. ఇతను "వేతిక నేను నా ఇష్టంగా" చిత్రానికి దర్శకత్వం వహించాడు, అంతేకాకుండా 2014 లో చల్లా భాను కిరణ్ దర్శకత్వంలో విడుదలైన "పంచముఖి" చిత్రంలో దర్శకుడుగా నటించాడు.

ఫిల్మోగ్రఫీ :

"వెల్కమ్ - ఒబామా" (2013) లో - సుబ్రహ్మణ్యం (అల్లుడు & పురోహితుడు) [44]"

వేతిక నేను నా ఇష్టంగా " (2014) లో - బాషా బాయ్ (డాన్) [45]

"పంచముఖి" (2014) లో - అస్పిరింగ్ డైరెక్టర్ [46]

"నా-నువ్వే" (2018) - ఆర్జే[47]

References[మార్చు]

  1. Basha, Shekar. "Candid Conversation with Swapna". Idream Media. Idream News. Retrieved 12 January 2022.
  2. "Shekar basha in Lockdown". epaper.v6velugu.com. No. Sunday special. V6 Velugu Telugu Daily. 17 May 2020. Retrieved 17 May 2020.
  3. "Radio Jockey Shekar Basha". No. Exclusive Interview. AT News Republic. 17 February 2019. Retrieved 17 May 2020.
  4. Basha, Shekar. "Roja with RaJa". HM TV. Hans India. Retrieved 12 January 2022.
  5. Y Krishna Jyothi (18 July 2010). "Desperate to give in, seriously!". Hyderabad. 1 (7): 65. Retrieved 2010-07-18.[permanent dead link]
  6. "Hyderabadi RJ makes history". The Hans India. 5 June 2012. Retrieved 15 June 2012.[permanent dead link]
  7. "Bashastram". Sakshi Telugu Daily. 11 June 2012. Archived from the original on 15 జూన్ 2012. Retrieved 15 June 2012.
  8. "RJ Sekhar wins IRF awards for the 6th time". The Hindu. 7 June 2012. Retrieved 15 June 2012.
  9. "Breakfast with Sekhar". The Hindu. 15 June 2012. Retrieved 15 June 2012.
  10. "RJ Shekar bags his sixth excellence award". IBN Live. Archived from the original on 8 June 2012. Retrieved 15 June 2012.
  11. "RJ Shekar creates history, won honours 6th year in row at India Radio Forum 2012". RadioandMusic.com. Retrieved 15 June 2012.
  12. "Excellence in radio awards". India radio forum. Archived from the original on 6 జూన్ 2014. Retrieved 4 June 2014.
  13. "Radio Awards". No. Sakshi, Hyderabad edition. Sakshi Daily News Paper (Telugu). 19 May 2017. Archived from the original on 26 మే 2017. Retrieved 21 May 2017.
  14. "IRF 2019" (in ఇంగ్లీష్). Retrieved 31 May 2019.
  15. "Excellence in Radio Awards". www.asiaradiotoday.com. RadioWise productions. 20 May 2017. Retrieved 22 May 2017.
  16. Shekar, RJ. "Excellence in Radio Award" (PDF). www.indiaradioforum.com. India Radio Forum. Archived from the original (PDF) on 18 మే 2015. Retrieved 15 May 2015.
  17. "Excellence in Radio Awards". No. 15 May 2015. Asia Radio Today, Australia. Radiowise Productions. 15 May 2015. Retrieved 18 May 2015.
  18. Basha, Shekar (18 May 2018). "Here's to tv's dishy dudes: Hyderabad times most desirable men on TV 2017 - Times of India". The Times of India. No. Hyderabad Times. The Time Group. Retrieved 18 May 2018.
  19. 19.0 19.1 Awards, Padma mohana (24 August 2016). "eye catching festival - Padmamohana Awards". Namasthe Telangana. Archived from the original on 28 ఆగస్టు 2016. Retrieved 25 August 2016.
  20. "93.5 S FM wins India Radio Forum Awards 2007". press release by 93.5 S FM. idlebrain. Retrieved 8 June 2007.
  21. "On November 6, 2009, I first started Kevu Keka on my show. It referred to anything that means 'too good.' I am not really looking for credit but when the song Kevu Keka came out for from Gabbar Singh happened, I was the happiest," says Sekhar, who's a very good mimic too". The Hindu. 15 June 2012. Retrieved 15 June 2012.
  22. "RJ Shekhar to host 'BIG Sandadi' on BIG 92.7FM". CNBC TV 18. 7 August 2007. Retrieved 7 August 2007.
  23. "Ruling the airwaves". Young Achievers. NXg is a weekly tabloid from The Hindu. Archived from the original on 5 అక్టోబరు 2011. Retrieved 9 November 2008.
  24. "Best Breakfast Show 2017". radioandmusic.com. radioandmusic.com. Retrieved 22 May 2017.
  25. "India Radio Forum 2007 Excellence in Radio Awards (ERA)" (PDF). List of IRF Award Winners for 2007. India Radio Forum. Retrieved 28 May 2007.[permanent dead link]
  26. "India Radio Forum 2008 Excellence in Radio Awards (ERA)" (PDF). List of IRF Award Winners for 2008. India Radio Forum. Archived from the original (PDF) on 28 ఆగస్టు 2008. Retrieved 28 May 2008.
  27. "India Radio Forum 2009 Excellence in Radio Awards" (PDF). List of IRF Award Winners for 2009. India Radio Forum. Retrieved 28 May 2009.[permanent dead link]
  28. "India Radio Forum 2010 Excellence in Radio Awards (ERA)" (PDF). List of IRF Award Winners for 2010. India Radio Forum. Retrieved 28 May 2010.[permanent dead link]
  29. "India Radio Forum 2011 Excellence in Radio Awards (ERA)" (PDF). List of IRF Award Winners for 2011. India Radio Forum. Archived from the original (PDF) on 26 జూన్ 2011. Retrieved 28 May 2011.
  30. Shekar Basha, RJ (5 June 2012). "RJ Shekar bags his sixth excellence award in 2012". News18. New18 Live TV. Retrieved 22 May 2016.
  31. shekar basha, RJ (1 June 2014). ""India Radio Forum 2012 Excellence in Radio Awards" TelevisionPost.com". Television Post. Archived from the original on 17 మే 2016. Retrieved 22 May 2016.
  32. Shekar, RJ. "Excellence in Radio Award" (PDF). www.indiaradioforum.com. India Radio Forum. Archived from the original (PDF) on 18 మే 2015. Retrieved 15 May 2015.
  33. "Excellence in Radio Awards 2017". www.indiareadioforum.com. India Radio Forum. Retrieved 22 May 2017.
  34. Shekar, RJ. "Santhosham Awards". www.Tupaki.com. Tupaki.com. Archived from the original on 25 సెప్టెంబరు 2014. Retrieved 18 May 2015.
  35. "Young Communicator Awards 2010". www.IndiaPRwire.com. Archived from the original on 3 మార్చి 2016. Retrieved 20 May 2015.
  36. "The New Indian Express-Hyderabad, 15-10-2019 : readwhere". The Indian Express. No. Hyderabad Edition. 15 October 2019. Retrieved 16 October 2019.
  37. "RJ Sekhar launches the 92-hour marathon". The Hindu. 18 September 2007. Archived from the original on 11 January 2008. Retrieved 18 September 2007.
  38. "RJ Shekar's 100-hour marathon live from a mobile studio". IndiaTelevision. 12 August 2008. Retrieved 31 January 2016.
  39. "RJ Marathon". PocketNewsAlert. 30 January 2016. Retrieved 31 January 2016.
  40. "RJ marathon". TheHansIndia. 27 January 2016. Retrieved 31 January 2016.
  41. "RJ shekar Basha Radio Marathon for 72 Hours | Plastic and its Harmful Effects | 92.7 BIG FM". Hybiz TV. 15 August 2018. Retrieved 18 August 2018.
  42. Basha, RJ shekar (22 August 2018). "Hyderabad Main, 22 August 2018 : readwhere". readwhere.com. No. Hyderabad Main edition. Namasthe TeLangana. www.NTnews.com. Retrieved 23 August 2018.
  43. shekar basha, RJ (25 August 2018). "Telangana Today - Local to Global News". Nikisha. No. huderabadd English daily. Telangana today. Archived from the original on 26 ఆగస్టు 2018. Retrieved 26 August 2018.
  44. movie review, welcome obama (20 September 2013). "RJ Shekar Basha and Ananth Sriram have done justice to their respective roles". oneIndia.in. Archived from the original on 11 జనవరి 2014. Retrieved 11 January 2014.
  45. "Vethika Nenu Naa Ishtamga (2014) || Comedy Scenes 01". teluguOne. objet1. 22 September 2014. Retrieved 18 August 2018.
  46. "Panchamukhi Trailer and songs. Telugu movie trailers, songs and clips from - IndiaGlitz.com". indiaglitz. Retrieved 18 August 2018.
  47. "Panchamukhi Songs Trailers - ABCD Studio loki Song". sillymonks. 28 August 2014. Retrieved 18 August 2018.

External links[మార్చు]

సవరణ సారాంశం ( మీ సవరణలను క్లుప్తంగా తెలపండి)