శోభన రాత్రి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
52-aspetti di vita quotidiana, amore,Taccuino Sanitatis, Cas.jpg

శోభన రాత్రి అనేది జీవితంలో ఒక ముఖ్యమైన కర్మ. భారతీయ ఉపఖండంలో కొత్తగా వివాహం చేసుకున్న జంట, వివాహం పూర్తయిన మొదటి రాత్రిని సూచిస్తుంది. కొత్త జంట యొక్క మంచం పువ్వులతో అలంకరించబడి ఉంటుంది, ఇవి వారి సంబంధానికి మధురమైన క్షణాలను ఇస్తాయని నమ్ముతారు. హిందూ వివాహాల్లో అనుసరించే ముఖ్యమైన ఆచారం ఇది.[1]

సాంప్రదాయము[మార్చు]

వధువు కుటుంబంలోని మహిళా సభ్యులు ఆచారంగా వధువును అలంకరించి పడకగదికి పంపిస్తారు. అక్కడ, ఆమె తన భర్త రాక కోసం ఒక గ్లాసు పాలతో వేచి ఉంటుంది. జంట యొక్క మంచం గులాబీలు, మల్లె, రజనిగంధ పువ్వులతో అలంకరించబడి ఉంటుంది. వధువు అలంకరించబడిన పడకగదిలో రావడానికి ముందు వరుడు కొంత సమయం బంధువులు, కుటుంబ సభ్యులతో బయట వేచి ఉండటం సాంప్రదాయం. నవ దంపతులు శోభనం గదిలోకి వెళ్లాక కొంతసేపు చాలామంది మహిళలు ఉండి వెళ్తారు. ఒక మహిళ (ఎంగి) మాత్రం రాత్రంతా అక్కడే కాపలా ఉంటారు. తొలిరాత్రికి సంబంధించి నవ వధువుకు ఏవైనా సందేహాలు ఉంటే తీర్చేందుకు అనుభవం కలిగిన వివాహితను అలా కాపలాగా ఉంచుతారు.

ముఖ్యంగా శోభన రాత్రి అనగా ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే పవిత్ర రతి క్రీడాకార్యం, ఇది జరిపిన తరువాత, జంట మరుసటి రోజు ఉదయాన్నే అందరికంటే ముందు నిద్రలేచి, స్నానం చేసి, దుస్తులు మార్చుకుంటారు. మునుపటి రాత్రి ధరించిన దుస్తులు మురికిగా పరిగణించబడతాయి. ఆ బెడ్‌షీట్ మీద రక్తపు మరకలు కనిపిస్తే ఆ నవ వధువు కన్యత్వానికి గుర్తుగా భావిస్తారు. మరకలు కనిపించగానే అందరూ నవ దంపతులకు అభినందనలు చెబుతారు.[2]

మూలాలు[మార్చు]

  1. "Telugu Wedding". Archived from the original on 29 జూన్ 2019. Retrieved 24 January 2020.
  2. "శోభనం రాత్రి బెడ్‌షీట్లు ఏం నిరూపిస్తాయి? పురాతన సంప్రదాయాలు ప్రస్తుత మహిళల్ని ఎలా వెంటాడుతున్నాయి?". Retrieved 24 January 2020.

బయటి లింకులు[మార్చు]