శ్యామ్ బిహారీ జైస్వాల్
శ్యామ్ బిహారీ జైస్వాల్ | |||
ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్య విద్య & ఇరవై పాయింట్ల అమలు విభాగం శాఖ మంత్రి
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2013 - 2023 13 డిసెంబర్ 2023 - ప్రస్తుతం | |||
ఎమ్మెల్యే
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 3 డిసెంబర్ 2023 | |||
నియోజకవర్గం | మనేంద్రగఢ్ | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1972 మధ్యప్రదేశ్, భారతదేశం (ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్, భారతదేశంలో ఉంది) | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
తల్లిదండ్రులు | దివంగత సూరజ్దీన్ జైస్వాల్ | ||
జీవిత భాగస్వామి | సూరజదీన్ జయసవాల్ | ||
నివాసం | రతన్‌పూర్ గ్రామం, మనేంద్రగర్ జిల్లా |
శ్యామ్ బిహారీ జైస్వాల్ ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రెండుసార్లు మనేంద్రగఢ్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచి, 2023 డిసెంబరు 22న విష్ణు దేవ్ సాయ్ మంత్రివర్గంలో మంత్రిగా ప్రమాణస్వీకారం చేశాడు.[1]
రాజకీయ జీవితం
[మార్చు]శ్యామ్ బిహారీ జైస్వాల్ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2010లో బీజేపీ ఉపాధ్యక్షుడిగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా, బీజేపీ కిసాన్ మోర్చా అధ్యక్షుడిగా పని చేశాడు. ఆయన 2013లో మనేంద్రగఢ్ నియోజకవర్గం నుండి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై 2014 నుండి 2015 వరకు చత్తీస్‌గఢ్ అసెంబ్లీ జనరల్ పర్పస్ కమిటీ ఛైర్మన్, సభ్యుడు సమర్పించిన పత్రాలను పరిశీలించడానికి కమిటీలో సభ్యుడిగా పని చేశాడు.
శ్యామ్ బిహారీ జైస్వాల్ 2018లో ఎన్నికల్లో ఓడిపోయి, 2023 ఎన్నికల్లో మనేంద్రగఢ్ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రమేష్ సింగ్‌పై 11880 ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచి, 2023 డిసెంబరు 22న విష్ణు దేవ్ సాయ్ మంత్రివర్గంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టాడు.[2][3]
మూలాలు
[మార్చు]- ↑ The Hindu (22 December 2023). "Chhattisgarh Cabinet expansion: Nine BJP MLAs sworn in as Ministers" (in Indian English). Archived from the original on 23 December 2023. Retrieved 23 December 2023.
- ↑ "बीजेपी से दूसरी बार विधायक बने श्याम बिहारी जायसवाल को मिला मंत्री पद, कैसा रहा है सियासी सफर" (in హిందీ). 22 December 2023. Archived from the original on 7 January 2024. Retrieved 7 January 2024.
- ↑ India Today (4 January 2024). "Chhattisgarh Chief Minister allocates portfolios, ex-IAS O P Choudhary gets finance" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2024. Retrieved 4 January 2024.