శ్రాబంతి చటర్జీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శ్రాబంతి ఛటర్జీ
শ্রাবন্তী চট্টোপাধ্যায়
జననం (1987-08-13) 1987 ఆగస్టు 13 (వయసు 36)
జాతీయతభారతీయులు
వృత్తిసినిమా నటి
క్రియాశీల సంవత్సరాలు1997–ప్రస్తుతం
ఎత్తు5 అడుగుల 4 అంగుళాలు
జీవిత భాగస్వామిరాజీవ్ బిస్వాస్ (Div. 2016), కృష్ణవ్రజ్ (Div. 2017)
పిల్లలుఅభిమన్యు ఛటర్జీ

శ్రాబంతి చటర్జీ (జ. ఆగస్టు 13, 1987)[1] బెంగాలీ సినిమా నటీమణి.[2][3]

సినిమా జీవితం[మార్చు]

ఆమె ప్రాథమికంగా కోల్‌కతా ఆధారిత పశ్చిమ బెంగాల్ సినిమా పరిశ్రమలో చేరింది. ఆమె 1997 లో మాయార్ బధోన్ చిత్రం ద్వారా సినీ ప్రస్థానాన్ని ప్రారంభించింది. ఆమె ఈటీవీ-బంగ్లా లో అనేక టెలీఫిల్మ్‌లలో నటించింది. ఆమె 2003 లో సూపర్ హిట్ సినిమా "ఛాంపియన్" లో ముఖ్య పాత్రను పోషించింది. తరువాత ఆమె 2008 లో "భలోబాషా భలోబాషా" సినిమాలో నటించింది. తరువత అనేక చిత్రాలలో ఆమె నటనా ప్రస్థానాన్ని కొనసాగించింది. 2013లో ఆమె అపర్నాసేన్ చిత్రం "గోయ్నార్ బక్షో" లో నటించింది.

వ్యక్తిగత జీవితం[మార్చు]

ఆమె 2003 లో సినిమా దర్శకుడైన "రాజీవ్ బిస్వాస్"ను వివాహమాడింది. వారికి "అభిమన్యు ఛాటర్జీ" అనే కుమారుడు కలిగాడు. తరువాత వారి మధ్య విభేదాల కారణంగా విడాకులు తీసుకున్నారు.

తరువాత ఆమె ఫోటోగ్రాఫర్, మోడల్ అయిన "కృష్ణన్ వ్రజ్" ను జూలై 2016 లో వివాహమాడింది. తరువాత 2017 చివరలో వారు కూడా విడాకులు తీసుకున్నారు.

టెలివిజన్[మార్చు]

  • చద్మాభేషి (టెలీ ఫిల్మ్‌) [4]
  • షార్ట్ కట్ ప్రేం (టెలీ ఫిల్మ్‌)[5]
  • గోల్పెర్ నాయికా (టెలీ ఫిల్మ్‌)[6]
  • సుదు తొమారి జోన్న్‌ (టెలీ ఫిల్మ్‌)
  • హొతత్ హవా (టెలీ ఫిల్మ్‌)
  • డాన్స్ బంగ్లా డాన్స్ జూనియర్ (రియాలిటీ షో - జీ బంగ్లా ఛానెల్ లో)

మూలాలు[మార్చు]

  1. http://tfpc.in/Bengali/srabanti-Chatterjee-passed-away/[permanent dead link]
  2. "10 questions". Calcutta, India: www.telegraphindia.com. 2008-11-10. Archived from the original on 2011-05-26. Retrieved 2009-02-14.
  3. "Finds of the year". Burdwan, India: www.telegraphindia.com. 2002-12-31. Archived from the original on 2010-08-06. Retrieved 2009-02-14.
  4. Chhadmabeshi (A Kaushik Ganguly Telefilm): Jishu Sengupta, Rudranil Ghosh, Srabanti Biswas. YouTube. 6 June 2012. Retrieved 2015-08-19.
  5. Sudhu Tomari Jonne (ETV Bangla) - Shortcut Prem "শর্টকাট প্রেম". YouTube. 25 January 2013. Retrieved 2015-08-19.
  6. Golper Nayika: directed by Sabyasachi Chakraborty. YouTube. 5 September 2012. Retrieved 2015-08-19.