శ్రీపాద (తెలుగు) - మాస్తి (కన్నడ) కథలు తులనాత్మక పరిశీలన

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

'

'''''శ్రీపాద (తెలుగు) - మాస్తి (కన్నడ) కథలు - తులనాత్మక పరిశీలన'''' మన భారత దేశంలో ఎన్నో భాషలు ఉన్నాయి. కానీ ఇరుగు పొరుగు భాషల్లో గోచరించే భావ సంపద గురించి గానీ, ఆలోచనా ప్రవాహాన్ని గానీ, సాంఘిక సంచలనాన్ని గురించి గాని మనకు తెలిసింది చాల‍ తక్కువ. భారత దేశంలోని ప్రతి భాషలోనూ ప్రఖ్యాతి చెందిన కొన్ని ఉత్తమ రచనలు ఇతర భారతీయ భాషల్లోకి అనువదించి అ రచనలను తులనాత్మక పరిశీలన ద్వారా వివేచించడం ద్వారా ఆయా ప్రదేశాలకు సంబంధించిన సాంఘిక జీవితం, సంస్కృతి, సామాజిక వాతారణం, జీవన విధానం, ఆచార వ్యవహారాలను ఇతర ప్రాంతీయులకు తెలియ పరచడం వల్ల ప్రజలకు పరస్పర పరిచయం ఏర్పడుతుంది. అందువల్ల జాతీయ సమైక్యత పెంపొంది అభివృద్ధి పథంలో నడుస్తుంది. దక్షిణాది భాషల్లోని సాహిత్య పరిశీలన ద్వారా ఇరుగు పొరుగు సాహిత్యాల్లోని స్థితి గతుల్ని తెలుసుకోవడం వల్ల సాహిత్యం పరిపుష్ఠం అవుతుంది. తెలుగు సాహిత్యంలో దీపస్తంభం వంటివారు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. కన్నడిగుల ఆస్తిగా కన్నడ సాహిత్యంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని నిలుపుకున్న కథకుడు జ్ఞానపీఠ అవార్డు గ్రహీత శ్రీ మాస్తి వెంకటేశ్వర అయ్యంగారు. వీరిరువురు సమకాలికులు. ఇటు ఆంధ్రలోనూ అటు కర్నాటకలోనూ రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఒకే సామాజిక నేపథ్యంలో కథలను రాసి సమాజ శ్రేయస్సు కొరకు పాటుపడిన సాహితీ మూర్తులు అయినందువల్ల వీరిద్దరి కథలపై తులనాత్మక పరిశీలన చేయాలనే ఆలోచన కలిగింది. సంఖ్యాపరంగా ఈనాడు తక్కు కథలే వస్తున్నా సమాజాన్ని విశ్లేషించి సమస్యల మూలాలను వెల్లడిస్తూ వాటి పరిష్కారాలను సూచిస్తున్న కథలు కొన్ని మాత్రమే వస్తున్నాయి. వాటి సంఖ్య ఎన్నో రెట్లు పెరిగితే గాని వాటి ఉనికి ప్రపంచానికి తెలియదు. అలా తెలియజేయడానికి కథాఁఆహిత్యానికి మార్గదర్శకులైన శ్రీపాద, మాస్తి కథల తులనాత్మక అధ్యయనం ఎంతో ఉపయోగపడుతుంది. కథ కళలకు కేంద్రబిందువు. ఉత్తమ కథాసాహిత్యం ఉత్తమ సమాజాన్ని నిర్మిస్తుంది. ఉత్తమ కథలు మరిన్ని రావాలంటే ఉత్తమ కథకుల జీవితం, వారి రచనల అధ్యయనం ఎంతో అవసరం. కాబట్టి ఉత్తమ కథకులైన శ్రీపాద, మాస్తి కథలను పరిశీలించి సమాజానికి వారు అందించిన సందేశాన్ని అందించడం అత్యంత ఆవశ్యం