Jump to content

శ్రీలంక సంచార జాతులు

వికీపీడియా నుండి
శ్రీలంకలోని అహికుంటికలు

శ్రీలంక సంచార జాతులు, భారతదేశంతో ప్రాచీన సంబంధాలు కలిగిన తెగల సమూహం. వీరంతా, సంచార జీవులు కావడం వల్ల, దీవి అంతటా కనిపిస్తారు. వీరు మాతృభాష తెలుగు. వివిధ ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు,క్రైస్తవ మిషనరీలు, వీరు ఒక ప్రాంతంలో స్థిరపడేందుకు ప్రయత్నం చేసాయి. అందువల్ల, వీరు కొన్ని గ్రామాలలో స్థిరపడుతున్నారు. సింహళీయులు వీరిని అహికుంటికలుగానూ, తమిళులు, ముస్లిములు వీరిని కుఱవరులుగానూ పిలుస్తారు. సోది చెప్పడం, పాములనాడించడం, పచ్చ బొట్లు పొడవడం, కోతులను, కుక్కలను ఆడించడం ద్వారా బతుకుని వెళ్ళదీస్తారు. గ్రామాలలో స్థిరపడుతున్న కొందరు రైతులుగానూ, రైతు కూలీలుగానూ కూడా జీవనాన్ని సాగిస్తున్నారు. వీరు స్థిరపడిన ప్రాంతాన్ని బట్టి సింహళము,తమిళము కూడా మాట్లాడగలరు. వీరు ఇటీవలికాలం వరకూ ప్రాథమికంగా హిందువులైనప్పటికీ, పెక్కు శాతం మంది క్రైస్తవానికి, బౌద్ధానికి మతాంతరీకరణ చెందుతున్నారు.[1][2][3][4]

శ్రీలంక సంచార జాతులలోని కులాలు,[5][6]

  • అహికుంటికలు - పాములనాడించేవారు
  • రామకుళవరలు - కోతులనాడించేవారు
  • వాగైలు - సోది చెప్పేవారు.

మూలాలు

[మార్చు]
  1. "Uplifting the ahikuntaka gypsy community". Dilmah Conservation. Archived from the original on 7 అక్టోబరు 2011. Retrieved 22 June 2014.
  2. "By the light of the gypsy fire". 13 February 2011. Retrieved 22 June 2011.
  3. Subasinghe, Wasantha. "Gypsy Culture and Society in the Changing World: A Sociological Analysis" (PDF). University of Kelaniya. Archived from the original (PDF) on 7 అక్టోబరు 2011. Retrieved 22 June 2011.
  4. McGilvray, Dennis (2008). Crucible of Conflict: Tamil and Muslim Society on the East Coast of Sri Lanka. Duke University Press. ISBN 978-0-8223-4161-1.
  5. "పొరుగు తెలుగు". Eemata. Retrieved 22 June 2014.
  6. "మన సీమ చూడాలి... అ ఆ లు నేర్చుకోవాలి!". Andhrabhoomi. Retrieved 22 June 2014.[permanent dead link]