Jump to content

శ్రీ పార్వతీ సమేత తురంగేశ్వరస్వామి ఆలయం

అక్షాంశ రేఖాంశాలు: 17°03′11″N 82°10′10″E / 17.0531°N 82.1695°E / 17.0531; 82.1695
వికీపీడియా నుండి
శ్రీ పార్వతీ సమేత తురంగేశ్వరస్వామి ఆలయం
శ్రీ పార్వతీ సమేత తురంగేశ్వరస్వామి ఆలయం is located in Andhra Pradesh
శ్రీ పార్వతీ సమేత తురంగేశ్వరస్వామి ఆలయం
శ్రీ పార్వతీ సమేత తురంగేశ్వరస్వామి ఆలయం
ఆంధ్రప్రదేశ్ లొ ఆలయ ఉనికి
భౌగోళికాంశాలు :17°03′11″N 82°10′10″E / 17.0531°N 82.1695°E / 17.0531; 82.1695
పేరు
ప్రధాన పేరు :శ్రీ పార్వతీ సమేత తురంగేశ్వరస్వామి ఆలయం
ప్రదేశం
దేశం:భారత దేశం
రాష్ట్రం:ఆంధ్ర ప్రదేశ్
జిల్లా:తూర్పు గోదావరి
ప్రదేశం:కాకినాడ తురంగి గ్రామం
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:శ్రీ పార్వతీ సమేత తురంగేశ్వరస్వామి ఆలయం
నిర్మాణ శైలి, సంస్కృతి
దేవాలయాలు మొత్తం సంఖ్య:ఒకటి

శ్రీ పార్వతీ సమేత తురంగేశ్వరస్వామి ఆలయం తూర్పు గోదావరి జిల్లా కాకినాడ తురంగి గ్రామంలో ప్రాచీనమైన ఆలయం.

ఆలయ చరిత్ర

[మార్చు]

పూర్వం త్రేకాయుగంలో శ్రీ రామచంద్రమూర్తి ఆరణ్యవాసం గడుపుతూ, సీతా లక్ష్మణులతో దండకారణ్యం దాటి ఈ ప్రాంతానికి వచ్చాడు. ముక్కూనెపులు కోయబడ్డ శూర్పణఖ కోరికపై రావణాసురుని ఆజ్ఞమేరకు మారీచుడు బంగారు వర్థంలో మెరిసిపోయే లేడిగా మారి సీతాదేవిని ఆకర్షించాడు. సీతాదేవి ఎంతో ముచ్చటపడి ఆ లేడి కావాలని కోరగా, సీతాదేవి కోరికను రాముడు బయలుదేరాడు.బంగారు మాయలేడి రూపంలో పున్న మారీచుడు రామునికి ముప్పుతిప్పలు పెడుతూ పారిపోతున్నాడు. శ్రీ రాముడు ఆ లేడిని పట్టుకోవాలని తరిమి తరిమి విసుగు చెంది ఈ తురంగి ప్రాంతాని వచ్చాడు.ఇక్కడే ధనస్సుకి బాణం సంధించారు.మారుతంలా పోయి మాయాలేడికి తగిలింది. బ్రహ్మరాక్షసుడైన మారీచుడు నిజరూపం దాల్చి ప్రాణాలు విడిచి పెట్టేశాడు. అది చూసిన శ్రీ రాముడు విపరీతంగా చింతించి, బ్రహ్మహత్యాపాపనివృత్తికోసం సప్త గోదావరులలో మొదటిది అయిన తుల్యభాగ నదీ తీరంలోని తురంగి క్షేత్రములో ఈ శ్వర లింగముని ప్రతిష్టించాడు. తద్వారా బ్రహ్మహత్య వలన కలిగిన పాపాన్ని నివృత్తి - చేసుకున్నాడు. తురంగిక్షేత్రమున వెలిసిన స్వామి గనుక శ్రీ తురంగేశ్వర స్వామిగా పిలవబడుతున్నాడు. ఇక్కడ స్వామివారు పార్వతీ దేవితో కలసి ఏక పీరము మీద ప్రతిష్టించబడి ఉంటుంది.[1]

ఉత్సవాలు

[మార్చు]

మహా శివరాత్రి అతి వైభవంగా జరుగుతుంది.

మూలాలు

[మార్చు]
  1. ఎన్. ఎస్, నాగిరెడ్డి (2003). తూర్పుగోదావరి జిల్లాలో ప్రసిద్ధి దేవాలయాలు. ఎన్ ఎస్ నాగిరెడ్డి.