Jump to content

శ్రీ మహర్షి జీవిత కథామృతం

వికీపీడియా నుండి

శ్రీ మహర్షి జీవిత కథామృతము బులుసు వేంకటేశ్వరులు రచించిన ప్రాచీన భారతవర్ష మహర్షుల జీవితచరిత్రలు పుస్తకం.

భారతీయ సంస్కృతిలోని సకలమైన ఊహలకు, ఆశలకు, ఆశయాలకు, తత్త్వాలకు మూలమైన మహాపురుషులు మహర్షులు. తపన జెందుతూ, ప్రకృతి నడకలోని సూత్రాలను అర్థం చేసుకుంటూ, భగవంతుని అపురూపమైన స్పర్శను అందుకుని దానిని మొత్తం మానవాళికి అందించిన మహానుభావులను మహర్షులని మన సంస్కృతి సంభావించింది. బట్ట కట్టుకోవడం, తిండి తినడం మొదలుకొని ఎలా జీవించాలి, ఎవరితో ఏం సంభాషించాలి మొదలైన ఎన్నెన్నో విషయాలను సాహిత్యం, సంప్రదాయం, విలువల ద్వారా అందజేసిన ఆ మహానుభావుల జీవితాలు తెలుసుకోవడం మనల్ని మనం పునరవలోకించుకోవడమే అవుతుంది ఈ గ్రంథం అలాంటి మహాపురుషుల జీవితాలను అందిస్తోంది.

మొదటి భాగము

[మార్చు]

దీని మొదటికూర్పు 1945లో ముద్రించబడగా, రెండవది 1947 లోను, మూడవది 1952లో విడుదలైనది. ఇది 1953లో ముద్రించబడిన నాల్గవ కూర్పు.

మూడవ భాగము

[మార్చు]

దీని మొదటికూర్పు 1953లో ముద్రించబడినది. ఇందులో పేర్కొన్న మహర్షుల జీవితాలు :

  1. అంగిరసుడు
  2. ఔర్వుడు
  3. కండుడు
  4. కణ్వుడు
  5. కర్దముడు
  6. గర్గుడు
  7. గౌరముఖుడు
  8. జాబాలి

ఇది కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]