శ్రీ విరించి
Appearance
శ్రీ విరించి కలం పేరుతో ప్రసిద్ధులైన డాక్టర్ నల్లాన్ చక్రవర్తుల రామానుజాచారి సుప్రసిద్ధ కథకుడు. రాజనీతి శాస్త్రంలో ఎంఏ, పారిశ్రామిక వాణిజ్య చట్టాలలో బీఎల్‌తో పాటు డాక్టరేట్ కూడా చేశారు. తులనాత్మక తత్వశాస్త్రంలోనూ పట్టభద్రులు.
జీవిత విశేషాలు
[మార్చు]ఆయన 1935లో విజయవాడలో జన్మించారు. మద్రాసులోని దివ్యజ్ఞాన సమాజంలో నివసిస్తున్నారు. ఆయన మొదటి రచన 1951లో ఖాసా సుబ్బారావు సంపాదకత్వంలోని "స్వతంత్ర" అనే తెలుగు వార పత్రికలో ప్రచురించబడినది. ఆ తరువాత ఆయన ఆంగ్లంలో రచనలు చేయడంప్రారంభించారు. 1979 లో సాహిత్య అకాడమీ జర్నల్ అయిన భారతీయ సాహిత్యం లో ప్రచురితమైనది.[1]
అవార్డులు
[మార్చు]- శ్రీ పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి అవార్డు (1990)
- డాక్టర్ దాశరథి రంగాచార్య అవార్డు
- శ్రీమతి కమలా సాహిత్య పురస్కారం (2004) వంటి పలు పురస్కారాలను అందుకున్నారు.
రచనలు
[మార్చు]తెలుగు
[మార్చు]- విజ్ఞానఖని అరిస్టాటిల్ జీవితం తాత్త్వికత
- పి. బ్లావట్‌స్కీ జీవిత-తత్త్వం
- గ్రీక్ తత్త్వవేత్త సోక్రటీస్ జీవితం తాత్త్వికత
- చిరంజీవి [2]
- గ్రీకు తత్త్వవేత్తలు[3]
- అర్థం (కథాసంపుటం)
- కారని కన్నీరు (కథాసంపుటం)
- మెట్లు లేని నిచ్చెన (కథాసంపుటం)
- కనకపు గట్టు (కథాసంపుటం)
- గంథపు చుక్క (కథాసంపుటం)
- నిధి చాల సుఖమా? (కథాసంపుటం)
- పడిలేచే కడలితరంగాలు (కథాసంపుటం)
- కొలను (కథాసంపుటం)
- కాలం కొలవని మనిషి (కథాసంపుటం)
- పద్మపత్రం (కథాసంపుటం)
- నగరమథనం (అనువాదం)
- ఉద్యోగం కోసం (అపురూపకాలు -శ్రవ్యనాటికలు)
- కథారామం (విమర్శ)
- ఉత్తర కర్ణాటక జానపద కథలు (అనువాదం)
- నిరంతర సత్యాన్వేషి
ఇంగ్లీషు
[మార్చు]- Awakening to Truth
- In the World of Magic an Introduction to the Study of ISIS Unveiled
- Secrets of Our Existence
- Some Significant Factors in Theosophy
- The True Path of Theosophy
- Understanding Krishnamurthi
- Words of Wisdom
- A Lonely Disciple (Monograph on T. Subba Row, 1856-1890)
- Waves and Waves and Other Stories
- Accept Me as I Am and Other Stories
థియోసాఫికల్ సొసైటీలో సేవలు..
[మార్చు]- రామానుజాచారి 1958 నుంచి థియోసాఫికల్ సొసైటీలో సభ్యులుగా ఉన్నారు. చెన్నై సమీపం అడయార్‌లోని సంస్థ ప్రపంచ ప్రధాన కార్యాలయంలో అనేక హోదాలలో బాధ్యతలు నిర్వర్తించారు.తెలుగు, ఇంగ్లిష్‌లో
- అనేక కథలు రాశారు. తెలుగులో 100, ఇంగ్లిష్‌లో 50కిపైగా విమర్శనాత్మక వ్యాసాలు రాశారు. వందలాది గ్రంథ సమీక్షలు చేశారు.
- కేంద్ర సాహిత్య అకాడమీకి, నేషనల్ బుక్‌ట్రస్ట్ ఆఫ్ ఇండియాకు అనువాదకులు.[4]
మరణం
[మార్చు]87 సంవత్సరాల వయ్ససులో గుండెపోటు కారణంగా జనవరి 26, 2022 న చెన్నైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.
మూలాలు
[మార్చు]- ↑ "Srivirinchi బయాగ్రఫీ". Archived from the original on 2016-01-19. Retrieved 2015-08-30.
- ↑ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో చిరంజీవి పుస్తక ప్రతి
- ↑ "పుస్తక పరిచయం-గ్రీకు తత్వవేత్తలు". Archived from the original on 2018-02-09. Retrieved 2015-08-30.
- ↑ "Telugu Poet: శ్రీ విరించి అనే కలం పేరుతో రచనలు చేసిన రచయిత?". Sakshi Education. Retrieved 2022-01-28.
ఇతర లింకులు
[మార్చు]- ఆంధ్రభూమిలో ఆయన కథ "సమాంతర సంశయం" Archived 2020-09-26 at the Wayback Machine