షంషుద్దీన్ ముహమ్మద్
ఈ వ్యాసాన్ని వికీకరించి ఈ మూసను తొలగించండి. |
తెలుగు నాట కౌముదిగా ప్రసిద్ధిగాంచిన షంషుద్దీన్ వృత్తిరిత్యా అధ్యాపకుడు అయినా ప్రవృత్తిరిత్యా, కవి, నవలాకారుడు, పాత్రికేయుడు, చరిత్రకారుడు,విమర్శకుడు అనువాదకుడు. ఆయన రాసిన వేలాది సాహితీ సమీక్షలు, వందలాది సాహిత్య వ్యాసాలు ఇంకా వెలుగులోకి చూడాల్సిందే ఉంది. మొత్తం మూడు నవలలు, అనేక అనువాదాలు, ‘అల్విదా’ పేరుతో కవితా సంకలనం అచ్చులో ఉన్నా అసంఖ్యాకంగా ఉన్న ఆయన రచనలు ఇంకా అముద్రితంగానే మిగిలి పోయాయి. తెలుగు, హిందీ, ఉర్దూ, ఆంగ్ల బాషలలో అపారమైన పాండిత్యం కలిగిన కౌముది కేవలం కవి రచయిత గానే కాకుండా గేయ రచయితగా కూడా ప్రసిద్దులు.
కౌముది అసలు పేరు షంషుద్దీన్ ఖమ్మం జిల్లా ఎరుపాలెం మండలం మీనవోలు గ్రామం లో జన్మించిన అతను పందొమ్మిది వందల అరవయ్యో దశకం (1966) నుండే పాత్రికేయుడిగా విశాలాంధ్ర దినపత్రికలో పనిచేసాడు. చాలీ చాలని వేతనం తో అతను ఒక వైపు కవితా వ్యాసంగాన్ని కొనసాగిస్తూనే మరోవైపు కుటుంబ బాధ్యతల లో సతమతం అయ్యాడు. కవిగా,అనువాదకుడిగా,పలుభాషల్లో ప్రావిణ్యం సంపాదించి ప్రపంచ సాహిత్యాలను ఔపోసన పట్టిన ఆయన గడిచిన ఇదు దశాబ్దాల కాలం లో సమకాలీన అంశాల మీద విస్తృతంగా రాస్తూ అనేక స్వతంత్ర అనువాద రచనలు సమాంతరంగా కొనసాగించాడు. మొదటి నుండీ అభ్యుదయ రచయితల సంఘం లో పనిచేస్తూ, ఖమ్మం జిల్లా రచయితల సంఘ కార్యకలాపాల భాగం అవుతూ కవిగా విమర్శకుడిగా తన సాహితీ ప్రస్థానాన్ని కొనసాగించాడు.
బయటి లింకులు
[మార్చు]- గుర్రం సీతారాములు (2019-06-01). "కత్తుల వంతెన మీద నడిచిన ఈ కాలపు మనిషి". సారంగ.[permanent dead link]