షఫీ అహ్మద్ వానీ
| షఫీ అహ్మద్ వానీ | |||
| అధికారంలో ఉన్న వ్యక్తి | |||
| అధికార ప్రారంభం 8 అక్టోబర్ 2024 | |||
| పదవీ కాలం 2008 – 2014 | |||
| ముందు | మహమ్మద్ సర్ఫరాజ్ ఖాన్ | ||
|---|---|---|---|
| తరువాత | ఒమర్ అబ్దుల్లా | ||
| నియోజకవర్గం | బీర్వా | ||
వ్యక్తిగత వివరాలు |
|||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
షఫీ అహ్మద్ వానీ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2008, 2024లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో బీర్వా నియోజకవర్గం నుండి రెండుసార్లు శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]
రాజకీయ జీవితం
[మార్చు]షఫీ అహ్మద్ వానీ జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ ద్వారా రాజకీయాలలోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2008లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో బీర్వా శాసనసభ నియోజకవర్గం నుండి పీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జేకేఎన్‌సీ అభ్యర్థి అబ్దుల్ మజీద్ మటూపై 164 ఓట్ల మెజారిటీ గెలిచి మొదటి సారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2] ఆయన 2014 శాసనసభ ఎన్నికలలో 17,554 ఓట్లతో మూడవ స్థానంలో నిలిచాడు.[3]
షఫీ అహ్మద్ వానీ ఆ ఆతరువాత జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలో చేరి 2024లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో జేకేఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి నజీర్ అహ్మద్ ఖాన్ పై 4,161 ఓట్ల మెజారిటీ గెలిచి రెండవసారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[4]
మూలాలు
[మార్చు]- ↑ India Today (8 October 2024). "J&K Election Results 2024: Full list of constituency wise winners" (in ఇంగ్లీష్). Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.
- ↑ "Statistical Report on General Election, 2008 to the Legislative Assembly of Jammu and Kashmir" (PDF). Election Commission of India. Archived from the original (PDF) on 25 December 2024. Retrieved 25 December 2024.
- ↑ "Jammu & Kashmir 2014 - Jammu & Kashmir - Election Commission of India". eci.gov.in. Archived from the original on 2019-06-13.
- ↑ Election Commission of India (8 October 2024). "J&K Assembly Election Results 2024 - Beerwah". Archived from the original on 9 July 2025.