Jump to content

షబ్నవీసు వెంకట రామ నరసింహ రావు

వికీపీడియా నుండి
షబ్నవీసు వెంకట రామ నరసింహ రావు
జననంషబ్నవీసు వెంకట రామ నరసింహ రావు
1886
నల్లగొండ
మరణం1929
ప్రసిద్ధిసాహిత్యోద్యమమూర్తి, తెలంగాణలో మొట్టమొదటి పత్రిక ‘నీలగిరి’ స్థాపకుడు.
మతంహిందూమతం
తండ్రిలక్ష్మీ నారాయణరావు
తల్లిరంగనాయకమ్మ

షబ్నవీసు వెంకటరామ నరసింహరావు (1896 - 1929) ప్రముఖ సాహిత్యోద్యమమూర్తి, తెలంగాణలో మొట్టమొదటి పత్రిక ‘నీలగిరి’ స్థాపకుడు.[1]


[2]

జననం

[మార్చు]

షబ్నవీసు వెంకట రామ నరసింహ రావు మన్మథనామ సంవత్సరం, కార్తీక మాసం అనగా 1896 నవంబరు నెలలో షబ్నవీసు లక్ష్మీ నారాయణ రావు, రంగనాయకమ్మ లకు జన్మించారు షబ్నవీసు లక్ష్మీ నారాయణ రావు తండ్రి గోపాల రావు నల్లగొండ సమీపంలో గల మామిళ్ళగూడెం గ్రామం మఖత్తగా సంపాదించారు.

సాహిత్య ప్రస్థానం

[మార్చు]

విద్య అందరికి అందాలని సత్సంకల్పంతో 1918, మార్చి18న నల్లగొండలో ఆంధ్ర సారస్వత నిలయంను స్థాపించాడు.[3] 1922 ఆగస్టు 24న మాడపాటి హనుమంతరావు, టేకుమల్ల రంగారావు, అక్కినేపల్లి జానకిరామారావు వంటి వారి ప్రోత్సాహాలతో తెలంగాణ జాగృతే లక్ష్యంగా నీలగిరి వారపత్రికను[1] వార్త లేనిదేలో కము అంధకార బంధురమవుతుందని భావించి, ఆనాడు నిజాం పాలనా కాలంలో నిర్భంధాన్ని అధిగమించి ఉస్మానియా ముద్రణాలయం స్థాపించి దాని ద్వారా సంస్కారిణి గ్రంథమాల ద్వారా ప్రతినెల ఒక మంచిపుస్తకం అందించాడు.

మరణం

[మార్చు]

ఈయన 1929లో మరణించాడు.[1]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 మన తెలంగాణ (14 August 2017). "షబ్నవీస్ బతికే ఉంటాడు…". Retrieved 9 June 2018.[permanent dead link]
  2. ఇందిరా రావు, షబ్నవీస్ (2017). షబ్నవీస్ జీవితం - సాహిత్యం. హైదరాబాద్: షబ్నవీస్ పబ్లికేషన్స్. p. 160.
  3. నమస్తే తెలంగాణ, నిపుణ (2 August 2016). "హైదరాబాద్ స్టేట్‌లో సాహిత్య ఉద్యమం". లింగమూర్తి. Retrieved 9 June 2018.

నర్రా ప్రవీణ్ రెడ్డి పరిశోధనాత్మక వ్యాసం - మన తెలంగాణ- షబ్నవీస్ బతికే ఉంటాడు...