షర్మిలా బిశ్వాస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

షర్మిలా బిశ్వాస్ ప్రముఖ భారతీయ ఒడిస్సీ నాట్యకళాకారిణి, కొరియోగ్రాఫర్. ఆమె గురు కెలుచరణ్ మోహపత్రా శిష్యురాలు. 1995లో కలకత్తాలో ఒడిస్సీ విజన్ అండ్ మూమెంట్ సెంటర్ ను స్థాపించింది.    ఈ  సంస్థకు  ఆమె ఆర్టిస్టిక్  డైరక్టర్. అలాగే ఆమె   ఒ.వి.ఎం రెపెర్టొరీ కూడా నడుపుతోంది. జాతీయ సంగీత, నృత్య, నాటక అకాడమీ అయిన సంగీత నాటక అకాడమీ 2012లో షర్మిలకు సంగీత నాటక అకడమీ పురస్కారం ఇచ్చింది.

షర్మిలా బిశ్వాస్

తొలినాళ్ళ జీవితం, చదువు

[మార్చు]

కలకత్తాలో పుట్టి పెరిగిన షర్మిలా, తన ఎనిమదవ ఏట నాట్యం నేర్చుకోవడం మొదలు పెట్టింది. ఆమె 16వ ఏట మురళీధరన్ మాఝీ వద్ద ఒడిస్సీ నృత్యంలో  శిక్షణ ప్రారంభించింది.  ఆ తరువాత కెలుచరణ్ మోహపత్రా వద్ద కూడ  ఒడిస్సీ నేర్చుకుంది.[1] ఆమె కళానిధి నారాయణన్ వద్ద అభినయాన్ని నేర్చుకుంది.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

1987లో డాక్టర్ స్వపన్ కుమార్ బిశ్వాస్ ను వివాహం చేసుకుంది షర్మిల. ఆయన వైద్య వృత్తిలో ఉన్నారు వారిద్దరూ కలకత్తాలో ఉంటున్నారు. వారికి ఒక కుమారుడు షౌమిక్ బిశ్వాస్.

కెరీర్

[మార్చు]

ఆమె దేశ విదేశాల్లో ఎన్నో ప్రతిష్ఠాత్మకమైన స్టేజిలపై నృత్యం చేసింది షర్మిల. ఎలిఫెంటా గుహలు, కజరహో గుహల, కోణార్క్ నృత్య ఉత్సవాల్లోనూ, లండన్, అమెరికాజర్మనీరష్యాదుబాయ్, బంగ్లాదేశ్ లలో నృత్య ప్రదర్శనలు  ఇచ్చింది  ఆమె.  షర్మిల సంప్రదాయ ఒడిస్సీ నృత్యాలే కాక, ప్రయోగాత్మక కొరియోగ్రాఫిక్ నృత్యాలు కూడా చేస్తుంది.[2][3]

ఒరిస్సాలో దేవదాసీలు ఎక్కువగా చేసే మహరీ నృత్యంపై ఎన్నో పరిశోధనలు చేసింది షర్మిలా.[4]

మూలాలు

[మార్చు]
  1. "Rhythms of life". The Telegraph. April 23, 2005. Retrieved May 28, 2013.
  2. Gowri Ramnarayan (January 28, 2010). "Treat to the eye and ear". The Hindu. Retrieved May 28, 2013.
  3. "A blend of lasya and tandava: Innovative dance recital by Sharmila Biswas marked the Dhauli Mohotsav". The Hindu. Apr 14, 2006. Archived from the original on 2013-06-29. Retrieved May 28, 2013.
  4. "Katha Kavya Abhinaya". Sangeet Natak Akademi. 2011. Retrieved May 28, 2013.