షామానిజం
స్వరూపం
షామాన్ అనునది మంగోలియా దేశానికి చెందిన ఒక విశ్వాసము. ఈ విశ్వాసం కలిగినవాడిని షామాన్ అని పిలుస్తారు. వీరి విశ్వాసాలలో ముఖ్యమైనది ఆత్మల లోకంతో సంబంధాలు, ఆత్మలతో మాట్లాడడం.షామానిజం, భౌతిక ప్రపంచానికి అతీతంగా, ఆత్మలోకాలపై ఆధారపడి తయారైన నమ్మకం, ఆత్మలు మానవుల జీవితాలపై ప్రభావాలు చూపుతారనే విశ్వాసం ద్వారా జనియించింది.[2] భారత్ లోని తాంత్రిక మాంత్రికుల లాగా వీరునూ అనేక రకాలైన క్షుద్రవిద్యలను అమలు పరచి వారి క్షుద్రలోకంలోనే జీవిస్తారు.
విశ్వాసాలు
[మార్చు]ప్రపంచంలోని విశ్వాసాలకు దూరంగా వీరిలో విశ్వాసాలున్నాయి. షామాన్లు అందరూ ఈ విశ్వాసాలు కలిగివుంటారు. ఎలియాడే (1964) గుర్తించిన కొన్ని సాధారణ విశ్వాసాలు :
- ఆత్మలు వున్నాయి, మనుషుల జీవితాలలో, సమాజాలతో వీరి బాంధవ్యాలు ప్రమేయాలు ఎక్కువ.
- షామాన్లు ఆత్మల లోకంతో సంబంధాలు కలిగివుంటారు.
- ఆత్మలు మంచివి చెడువి రెండునూ వుండవచ్చును.
- చెడు ఆత్మలచే కలిగింపబడిన అనారోగ్యాలను షామన్లు నయం చేయగలరు.
- షామాన్లు "ట్రాన్స్" లోకి వెళ్ళగలరు, ఎవరూ వీక్షించని వాటికి వీరు వీక్షించగలరు.
- షామాన్ల ఆత్మ, వాటి శరీరాలను వదలి, అనేక లోకాలకు చుట్టి రాగలవు.
- షామాన్లు జంతువుల బొమ్మలను "ఆత్మ మార్గదర్శకులు" గాను, సందేశాలనిచ్చే వారని భావించేవారు.
- షామాన్లు భవిష్యత్తును గూర్చి చెప్పేవారు. ఎముకలను ఎగురవేసి అనేక ఇతర ఆధ్యాత్మిక విషయాలను చేపట్టేవారు.
మూలాలు
[మార్చు]- ↑ Hoppál, Mihály (2005). Sámánok Eurázsiában (in Hungarian). Budapest: Akadémiai Kiadó. ISBN 9630582953.
{{cite book}}
: CS1 maint: unrecognized language (link) p. 77, 287; Znamensky, Andrei A. (2005). "Az ősiség szépsége: altáji török sámánok a szibériai regionális gondolkodásban (1860–1920)". In Molnár, Ádám (ed.). Csodaszarvas. Őstörténet, vallás és néphagyomány. Vol. I (in Hungarian). Budapest: Molnár Kiadó. pp. 117–134. ISBN 963 218 200 6.{{cite book}}
: CS1 maint: unrecognized language (link), p. 128 - ↑ Salak, Kira. ""HELL AND BACK"". National Geographic Adventure.
బయటి లింకులు
[మార్చు]- అమజోనియన్ షామానిజంపై ఓ డాక్యుమెంటరీ Archived 2014-12-17 at the Wayback Machine