షెడ్యూల్డ్ కులాల/షెడ్యూల్డ్ తెగల అణచివేత చట్టపు దుర్వినియోగం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

షెడ్యూల్డ్ కులాల/షెడ్యూల్డ్ తెగల అణచివేతను అరికట్టటానికి భారతీయ శిక్షాస్మృతి రూపొందించిన చట్టాలను ఈ కులాలు/తెగలు దురినియోగం చేస్తూ, ప్రతీకారేచ్ఛతోనో, కేవలం అసౌకర్యం కలుగజేయాలనో, రాజీ రూపంలో ధనం సమకూర్చుకోవాలనో అమాయకులైన సగటు పౌరునిపై నిరాధార ఆరోపణలు వేయటమే షెడ్యూల్డ్ కులాల/షెడ్యూల్డ్ తెగల అణచివేత చట్టపు దుర్వినియోగం (ఆంగ్లం:Misuse of Prevention of SC/ST Atrocity Act).

పీడిత వర్గాలను రక్షించటానికి రూపొందించబడిన ఈ చట్టం దుర్వినియోగం కారాదని న్యాయస్థానాలు సైతం అభిప్రాయపడినవి.[1]

దళితులని ప్రత్యేక వర్గంగా గుర్తించి వారికి పక్షపాతంగా వ్యవహరించటంతో ఇతరులు వివక్షకు లోనౌతున్నారని న్యాయనిపుణులలో అభిప్రాయం కలదు. ఈ చట్టం క్రింద నమోదైన వ్యాజ్యాలలో సింహభాగం ముద్దాయిలు నిర్దోషులుగా తేలటమే ఇందుకు కారణం. [2]

వ్యాఖ్యలు[మార్చు]

ఢిల్లీ కోర్టుకు చెందిన ఒక న్యాయమూర్తి

"Unfortunately, one comes across growing instances of cases where the provisions of this Act have not so much been invoked for the betterment of those to whom it seeks to protect, than by those who want to settle personal scores by giving to an otherwise ordinary dispute, the colour of an alleged atrocity under the Act."
"(దురదృష్టవశాత్తూ, దళిత అణచివేత/అంటరానితనానికి గురైనవారి రక్షణ/అభివృద్ధి కంటే, వాటికి ఏమాత్రం గురికాని వారు సైతం, ఇతర సాధారణ కలహాలకు ఈ రంగు పులిమి వ్యక్తిగత కక్ష సాధించుకొనటానికే ఈ చట్టాన్ని ఎక్కువగా దుర్వినియోగం చేస్తున్నారని ఎవరికైనా అనిపిస్తుంది.)"

"Law cannot be the absolute property of a few and this court can only hope and appeal that the provisions of this Special Legislation are not abused by a few so as to ensure that its benefit is able to actually reach the exploited sections."
"(చట్టం ఏ కొద్దిమంది సొత్తో కారాదు, ఈ ప్రత్యేక చట్టం యొక్క ప్రయోజనాలు కొంతమందిచే దుర్వినియోగం పాలు కారాదని, నిజంగా అణచివేతకు గురైన వారికి అవి అందాలని ఈ న్యాయస్థానం ఆశిస్తోంది, కోరుకొంటోంది.)"

ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ ప్రతినిధి కే బాలు

"It (The Constitution of India) addresses untouchability against all classes in general, without restricting it to any particular class. It is not addressed in favour of SC/STs as a separate class."
"(భారత రాజ్యాంగం అంటరానితనాన్ని ప్రత్యేకించి ఒక వర్గం పై అని కాకుండా ఏ వర్గాలకైనా అని చెప్పినదే తప్ప, కేవలం షెడ్యూల్డు కులాల/షెడ్యూల్డు తెగల పక్షపాతంగా ఏ మాత్రం చెప్పలేదు.)"

మూలాలు[మార్చు]