షెఫాలి వర్మ
వ్యక్తిగత సమాచారం | |
---|---|
జననం | రోహ్‌తక్, హర్యానా, భారతదేశం | 2004 జనవరి 28
క్రీడ | |
దేశం | భారతదేశం |
క్రీడ | క్రికెట్ |
షెఫాలీ వర్మ (జననం 2004 జనవరి 28) భారతీయ మహిళా క్రికెట్ జట్టు సభ్యురాలు. దేశంలో అతి చిన్న వయసులోనే అంతర్జాతీయ ట్వెంటీ ట్వెంటీ మ్యాచ్ ఆడిన క్రికెటర్. 16 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసిన సచిన్ టెండుల్కర్ పేరిట 30 ఏళ్లుగా చెక్కు చెదరకుండా ఉన్న రికార్డును షెఫాలీ బద్దలు కొట్టింది. కేవలం 15ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ మ్యాచ్‌లో అర్ధ సెంచరీ చేసి సరికొత్త రికార్డు నెలకొల్పింది.[1][2]
బీబీసీ శతవసంతాల ఏడాది సందర్భంగా 2022 మార్చి నెలలో ‘ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును షఫాలీ వర్మ సొంతం చేసుకుంది.[3]
వ్యక్తిగత జీవితం, నేపథ్యం
[మార్చు]2013లో సరిగ్గా షెఫాలీకి 9 ఏళ్ల వయుసులో ఉండగా దిల్లీకి సమీపంలోని రోహతక్ మైదానంలో సచిన్ టెండుల్కర్ తన చివరి రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడుతుంటే ఆ మ్యాచ్ చూసేందుకు షెఫాలీ తండ్రి స్టేడియంకి తీసుకెళ్లాడు. 9 ఏళ్ల షెఫాలీకి అది నిజంగా మర్చిపోలేని రోజు. సచిన్ తన ముంబై జట్టును గెలిపించిన తీరు ఆమెలో ఎనలేని స్ఫూర్తిని నింపింది.
చాలా ఇంటర్వ్యూల్లో తనకు సచిన్ ఆదర్శం అని చెప్పింది షెఫాలీ. అయితే ఆయన కన్నా ముందు ఆమెలో క్రికెట్ క్రీడ పట్ల ఆసక్తి పెరిగేలా చేసిన మరో వ్యక్తి ఆమె తండ్రి. ఆయన క్రికెట్‌కు వీరాభిమాని.
వర్మ సోదరుడు లోకల్ క్రికెట్ క్లబ్స్ తరపున ఆడేవాడు. అయితే అమ్మాయి కావడంతో వాళ్లు షెఫాలీకి అవకాశం ఇచ్చేవారు కాదు. దీంతో ఆమె తండ్రిలో సరికొత్త ఆలోచన వచ్చింది. అనుకున్నదే తడవుగా ఆమెను జత్తును కత్తిరించి అబ్బాయిలా తయారు చేశాడు. ఆపై అవకాశం వచ్చినప్పుడల్లా తనను తాను నిరూపించుకునేది షెఫాలీ.
ఓ సారి ఆమె సోదరుడు అనారోగ్యం పాలవడంతో లోకల్ క్లబ్ తరపున ఆథాని స్థానంలో షెఫాలీ ఆడి కేవలం మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మాత్రమే కాదు. ఆ టోర్నమెంట్లో మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌ను కూడా కైవసం చేసుకుంది.[2][4]
2019లో దక్షిణాఫ్రికాతో జరిగిన టీ ట్వంటీ మ్యాచ్ ద్వారా కేవలం15 ఏళ్ల వయసులోనే షెఫాలీ అంతర్జాతీయ కెరియర్ మొదలయ్యింది.
2019లో వెస్టీండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్ధ సెంచరీ సాధించడం ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అతి చిన్న వయసులోనే ఈ ఘనత సాధించిన క్రికెటర్‌గా రికార్డు సృష్టించింది. వెస్టిండీస్‌పై ఐదు మ్యాచ్‌లలో 158 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది సీరిస్‌గా నిలిచింది.[5]
2020 జనవరిలో ఆస్ట్రేలియాలో జరగనున్న టీ ట్వంటీ వరల్డ్ కప్‌లో ఆడేందుకు బీసీసీఐ భారత జట్టుకు షెఫాలీని ఎంపిక చేసింది.[4]
స్టార్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచిన షెఫాలీ 161 స్ట్రైక్ రేట్‌తో అత్యధిక పరుగులు చేసిన మూడో బ్యాట్స్ వుమెన్‌గా నిలిచింది. ఆమె ఆట తీరును చూసిన భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ షెఫాలీని రాక్ స్టార్ అంటూ ప్రశంసల జల్లు కురిపించాడు.
2021 నాటికి షెఫాలీ వర్మ ఐసీసీ విమెన్స్ టీ ట్వెంటీ ర్యాంకింగ్స్‌లో మూడవ స్థానంలో ఉంది.[6]
మూలాలు
[మార్చు]- ↑ "Meet India's 16-year-old 'rock star'". BBC Sport (in బ్రిటిష్ ఇంగ్లీష్). Retrieved 2021-02-18.
- ↑ 2.0 2.1 "Shafali Verma Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2021-02-18.
- ↑ "మల్లీశ్వరికి 'బీబీసీ లైఫ్ టైమ్' అవార్డు". andhrajyothy. 2022-03-29. Archived from the original on 2022-03-28. Retrieved 2022-03-28.
- ↑ 4.0 4.1 Sportstar, Team. "Women who inspire us: Shafali Verma". Sportstar (in ఇంగ్లీష్). Retrieved 2021-02-18.
- ↑ "Shafali Verma: The strong girl who's batting down barriers". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2021-02-18.
- ↑ "ICCWORLDTWENTY20.COM". www.iccworldtwenty20.com. Retrieved 2021-02-18.