షెహనాజ్ గిల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
షెహనాజ్ గిల్
2022లో షెహనాజ్ గిల్
జననం (1993-01-27) 1993 జనవరి 27 (వయసు 31)[1][2] or (1994-01-27) 1994 జనవరి 27 (వయసు 30)[3][4]
పంజాబ్, భారతదేశం
విద్యబీకాం , లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ
వృత్తి
 • మోడల్
 • నటి
 • గాయని
క్రియాశీల సంవత్సరాలు2015 – ప్రస్తుతం
సుపరిచితుడు/
సుపరిచితురాలు
హిందీ బిగ్ బాస్ సీజన్ 13, హోన్స్లా రఖ్

షెహనాజ్ గిల్ (జననం 1993 జనవరి 27) భారతీయ నటి, మోడల్, గాయని కూడా. మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించి నటిగా మారిన షెహనాజ్ గిల్ పలు మ్యూజిక్ వీడియోస్, టెలివిజన్ షోస్‌లో పాల్గొని గుర్తింపు సంపాదించుకుంది. షెహ్నాజ్ కౌర్ అని కూడా పిలువబడే ఆమె పంజాబీ, హిందీ టెలివిజన్, చిత్రాలలో నటిస్తుంది.

ఆమె తన మోడలింగ్ వృత్తిని 2015 మ్యూజిక్ వీడియో శివ్ ది కితాబ్‌తో ప్రారంభించింది. ఆమె 2017లో పంజాబీ చిత్రం సత్ శ్రీ అకాల్ ఇంగ్లాండ్‌లో నటిగా రంగప్రవేశం చేసింది. 2019లో రియాలిటీ షో బిగ్ బాస్ 13లో పాల్గొన్న ఆమె మూడవ స్థానంలో నిలిచింది.[5]

బాల్యం, విద్యాభ్యాసం

[మార్చు]

పంజాబ్‌లో 1993 జనవరి 27న సిక్కు కుటుంబంలో షెహనాజ్ గిల్ జన్మించింది. ఆమెకు చిన్నప్పటి నుండి నటించడం, పాడటం అంటే చాలా ఇష్టం. ఆమె డల్హౌసీ హిల్‌టాప్ స్కూల్, డల్హౌసీ నుండి పాఠశాల విద్యను అభ్యసించింది. ఫగ్వారాలోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్శిటీ నుండి కామర్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది.

కెరీర్

[మార్చు]

2015లో శివ్ ది కితాబ్ లో నటించడం ద్వారా తన వృత్తిని ప్రారంభించింది. ఆమె 2016లో మఝే ది జట్టి, పిండాన్ దియాన్ కుడియాన్, గ్యారీ సంధుతో యే బేబీ రీఫిక్స్ లలో నటించింది.

2017లో సత్ శ్రీ అకాల్ ఇంగ్లాండ్, 2019లో కాలా షా కాలా, దాకా వంటి పంజాబీ చిత్రాలలో ఆమె నటించింది. సెప్టెంబరు 2019లో బిగ్ బాస్ 13లో సెలబ్రిటీ పార్టిసిపెంట్‌గా ఆమె ప్రవేశించింది. ఈ సీజన్ ఫిబ్రవరి 2020లో ముగియగా ఆందులో ఆమె రెండవ రన్నరప్‌గా నిలిచింది. ఆ సమయంలో ఆమె

చేసిన వేహం, సైడ్‌వాక్, రేంజ్, రోండా వంటి సింగిల్స్ వచ్చాయి.

ఫిల్మోగ్రఫీ

[మార్చు]

సినిమాలు

[మార్చు]
Year Title Role Language Ref.
2017 సత్ శ్రీ అకాల్ ఇంగ్లాండ్‌ సోనియా ఖన్నా పంజాబీ [6]
2019 కాలా షా కాలా తారో
దాక పుష్ప
2021 హోన్స్లా రాఖ్ స్వీటీ [7]
2023 కిసీ కా భాయ్ కిసీ కి జాన్ హిందీ [8]

మూలాలు

[మార్చు]
 1. "shehnaaz gill celebrates birthday with Sidharth Shukla and family, he throws her in pool". Hindustan Times. 27 January 2021.
 2. "Bigg Boss 13's Shehnaaz Gill rings in her 27th birthday with Sidharth Shukla's family; he throws her in the pool". The Times of India. 27 January 2021.
 3. "Shehnaaz Gill celebrates 27th birthday with Sidharth Shukla, watch videos". The Indian Express. 27 January 2021. Retrieved 14 June 2021.
 4. "On Shehnaaz Gill's 27 the birthday Sidharth Shukla throws her into pool.Watch epic video". NDTV. 27 January 2021.
 5. "Shehnaaz Gill: ఫ్యాన్‌ను ఫిదా చేసిన హీరోయిన్ | Shehnaaz Gill mesmerises her fan with thanking gesture jay-MRGS-Chitrajyothy". web.archive.org. 2023-02-16. Archived from the original on 2023-02-16. Retrieved 2023-02-16.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
 6. "Bigg Boss 13: 5 times Shehnaaz Kaur Gill proved she has the CUTEST style on Indian TV". The Times of India. 22 January 2020. Retrieved 22 April 2020.
 7. "Honsla Rakh: Diljit Dosanjh collaborates with Shehnaaz Gill, Sonam Bajwa in comedy caper". The Indian Express. 19 February 2021. Retrieved 2 April 2021.
 8. "Shehnaaz Gill To Make Her Bollywood Debut With Salman Khan's Kabhi Eid Kabhi Diwali: Report". NDTV. 21 April 2022. Retrieved 22 April 2022.