సంకల్పం

వికీపీడియా నుండి
(సంకల్పము నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

హిందువుల పూజా సంప్రదాయంలో పూజ ప్రారంభానికి ముందు గృహస్థులు స్థలకాలాదుల విశేషాలను, తన స్వంత పరిచయాన్నీ చెప్పుకుంటారు. దీన్ని సంకల్పం అంటారు. సాధారణంగా పూజ ప్రధాన భాగం ఈ సంకల్పంతో ప్రారంభమౌతుంది. ఈ సంకల్పం సంస్కృతంలో ఉంటుంది.

సంకల్పం పాఠ్యం[మార్చు]

సంకల్పం పాఠ్యం కింది విధంగా ఉంటుంది:[1]

శుభే శోభనముహుర్తే అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రధమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే కృష్ణా కావేరీ మధ్య దేశే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన _____ సంవత్సరే _____ అయనే _____ ఋతౌ _____ మాసే, శుక్ల/కృష్ణ పక్షే _____ తిథౌ _____ వాసర సంయుక్తాయాం శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయామ్ శుభతిథౌ శ్రీమాన్ _____ గోత్రోద్భవస్య  _____ నామధేయోహం

ఇందులో "అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రధమపాదే " అనే భాగం కాలాన్ని సూచిస్తుంది.

  • ఆద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే - ఈ బ్రహ్మ యొక్క జీవితపు రెండవ భాగంలో
  • శ్వేతవరాహ కల్పే - శ్వేతవరాహ కల్పంలో
  • వైవస్వత మన్వంతరే - వైవస్వతం అనే పేరున్న మన్వంతరంలో. ఒక్కో కల్పంలో 14 మన్వంతరాలుంటాయి. ఈ కల్పంలో ఇది 7 వ మన్వంతరం.
  • కలియుగే - కలియుగంలో. ఒక్కో మన్వంతరంలో ఉండే కృత, త్రేతా, ద్వాపర, కలియుగాల్లో ఇది కలియుగం
  • ప్రధమపాదే - ఆ యుగంలో ఉండే నాలుగు పాదాల్లో ఇది మొదటి పాదం

"జంబూద్వీపే భరతవర్షే భరతఖండే" అనేది స్థలాన్ని సూచిస్తుంది.

  • జంబూద్వీపే - జంబూద్వీపంలో. ఇది యావత్తు భూగోళాన్ని సూచిస్తుంది
  • భరతవర్షే - భరత వర్షంలో. ఇది భారతదేశంతో సహా భౌగోళికంగా మరింత విస్తారమైన ప్రాంతాన్ని (యూరేషియాను కూడా కలుపుకుని) సూచిస్తుంది
  • భరతఖండే - భరత ఖండంలో. ఇది భారతదేశాన్ని సూచిస్తుంది

ఈ తరువాత గృహస్థు తానున్న స్థలాన్ని మరింత స్థానికంగా వివరిస్తాడు. అది కొన్ని స్థలాలకు ఇలా ఉంటుంది

  • మేరోర్దక్షిణ దిగ్భాగే - మేరు పర్వతానికి దక్షిణ ప్రాంతంలో
  • శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే - శ్రీశైల క్షేత్రానికి ఈశాన్యంలో
  • కృష్ణా కావేరీ మధ్య దేశే - కృష్ణా గోదావరి నదుల మధ్య ప్రాంతంలో

ఆ తరువాత, పంచాంగం ప్రకారం తిథి వివరాలను చెప్పి, గృహస్థు గోత్ర నామాదులను ఇలా చెప్పుకుంటారు.

అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన _____ సంవత్సరే _____ అయనే _____ ఋతౌ _____ మాసే, శుక్ల/కృష్ణ పక్షే _____ తిథౌ _____ వాసర సంయుక్తాయాం శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయామ్ శుభతిథౌ శ్రీమాన్ _____ గోత్రోద్భవస్య _____ నామధేయోహం

ఈ విధంగా స్థల కాలాదులను స్వీయ గోత్ర నామాదులనూ చెప్పుకుని, తామందరి కోరికలు నెరవేరేందుకు గాను ఈ పూజ చేస్తున్నానని కింది విధంగా చెప్పుకుని పూజను మొదలుపెడతారు

మమ సహకుటుంబస్య,క్షేమ,స్థైర్య , వీర్య, విజయ, అభయ, ఆయురారోగ్య, ఐశ్వర్యాభివౄధ్యార్థం, పుత్రపౌత్రాభివౄధ్యార్థం, మమధర్మార్థ, కామమోక్ష, చతుర్విధ ఫలపురుషార్థం, సర్వ్వాభీష్ట సిధ్యర్థం శ్రీవరలక్ష్మీ దేవతా ముద్దస్య వరలక్ష్మీ దేవతా ప్రీతార్థం కల్పోక్త ప్రకారేణ యావచ్చక్తి ధ్యానావాహనాది షోడోపచార పూజాం కరిష్యే[2]

మూలాలు[మార్చు]

  1. "గణేష్ చతుర్థి: వినాయక పూజా విధానం, ఏం కావాలి, ఎలా చేయాలి?". వన్ ఇండియా. Archived from the original on 2024-04-09. Retrieved 2024-04-09.
  2. "నిత్య పూజా విధానం - Daily Pooja Procedure In Telugu" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2020-05-09. Archived from the original on 2023-01-28. Retrieved 2024-04-09.
"https://te.wikipedia.org/w/index.php?title=సంకల్పం&oldid=4182697" నుండి వెలికితీశారు