సంగీత సౌరభము
(సంగీత సౌరభం నుండి దారిమార్పు చెందింది)
సంగీత సౌరభము | |
కృతికర్త: | శ్రీపాద పినాకపాణి |
---|---|
దేశం: | భారతదేశం |
భాష: | తెలుగు |
సీరీస్: | నాలుగు సంపుటాలు |
విభాగం (కళా ప్రక్రియ): | సంగీతం |
ప్రచురణ: | తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి |
విడుదల: | 1995, 1997, 1998, 1999 |
సంగీత సౌరభము శ్రీపాద పినాకపాణి రచించిన విశిష్టమైన సంగీతరచన.
త్యాగరాజాది వాగ్గేయకారుల రచనలు, గీతాలు, స్వరజతులు, స్వరపల్లవులు, తాన పద వర్ణములు, కృతులు, పల్లవులు, జావళీలు మొదలైన సంగీత రచనలు ఏరికూర్చి, పుస్తకరచనకు శ్రీకారం చుట్టారు..సంగీత సౌరభం పేరుతో తిరుమల తిరుపతి దేవస్థానములు ప్రచురించిన నాలుగు సంపుటాలలో వీరు స్వర పరచిన అన్నమాచార్య కృతులు 108, త్యాగరాజాది వాగ్గేయ కారుల కృతులు 607, ముత్తు స్వామి దీక్షితుల కృతులు 173, పదములు 44, జావళీలు 40, తానవర్ణములు, 56, తిల్లనాలు, 10 మొత్తం 1088 సంగీత గుళికలు పాదపీఠికలతో బాటుగా ఉన్నాయి.
నేపధ్యం
[మార్చు]1952 సంవత్సరంలో అన్నమాచార్యులు కీర్తనలను తి.తి.దే.వారు రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ గారు స్వర సహితంగా ప్రచురించి నాంది పలికింది. అది మొదలు ఎన్నో సంగీత గ్రంథాలను ముద్రించి విద్యార్ధులకు ఉపయోగపడుతున్నారు.
విషయ సూచిక
[మార్చు]- ప్రథమ సంపుటం: ఇందులో త్యాగరాజు, ముత్యుస్వామి దీక్షితాది వాగ్గేయకారులతోబాటు పినాకపాణిగారు స్వయంగా స్వరపరచిన 25 అన్నమయ్య కృతులు మరికొన్ని జావళీలు, తిల్లానాలు కలిపి మొత్తం 276 రచనలు వివరించబడ్డాయి.[1] చివరలో 110 రాగ లక్షణాలు అదనంగా పేర్కొన్నారు.
- రెండవ సంపుటం: ఇందులో కూడా ప్రముఖ వాగ్గేయకారుల రచనలు 296 స్వరాలతో పాటు అందించారు. గ్రంథం చివర రాగలక్షణాలు చేర్చారు.[2]
- మూడవ సంపుటం: ఇందులో అన్నమాచార్యులు, త్యాగరాజు (135), ముత్తుస్వామి దీక్షితులు (46), శ్యామశాస్త్రి, సుబ్బరాయ శాస్త్రుల కృతులు (11), క్షేత్రయ్య తదితరులు రచించిన పదాలు (14), జావళీలు (14), తిల్లానాలు (3), తిరుప్పగల్ (4) తో మొత్తం 271 రచనలను రాగస్వరసహితంగా అందించారు.[3]
- నాలుగవ సంపుటం: ఇందులో వివిధ వాగ్గేయకారులు రచించిన కృతులు, పదములు, జావళీలు, తిల్లానాలు, తిరుప్పగళ్ రచనలు మొత్తం 277 పొందుపరిచారు.[4]
మూలాలు
[మార్చు]- ↑ శ్రీపాద పినాకపాణి (1995). సంగీత సౌరభము (ప్రథమ సంపుటం). తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానములు. Retrieved 26 September 2020.
- ↑ శ్రీపాద పినాకపాణి (1997). సంగీత సౌరభము (రెండవ సంపుటం). తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానములు. Retrieved 26 September 2020.
- ↑ శ్రీపాద పినాకపాణి (1998). సంగీత సౌరభము (మూడవ సంపుటం). తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానములు. Retrieved 26 September 2020.
- ↑ శ్రీపాద పినాకపాణి (1999). సంగీత సౌరభము (నాలుగవ సంపుటం). తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానములు. Retrieved 26 September 2020.