Jump to content

సంజీవ్ మెహతా

వికీపీడియా నుండి
సంజీవ్ మెహతా

ఈస్ట్ ఇండియా కంపెనీని కొని దానికి సీఈవోగా వ్యవహరిస్తున్న భారతీయుడు సంజీవ్ మెహతా. ఇతని పూర్తి పేరు సంజీవ్ చాంద్ మెహతా. పచారీ సామాన్లు అమ్ముకుంటామంటూ భారతదేశంలోకి ప్రవేశించి, ఇక్కడి వాళ్లను శాసించి, పాలించిన విదేశీ సంస్థ "ఈస్ట్ ఇండియా కంపెనీ". సంజీవ్ మెహతా గుజరాత్‌లో వజ్రాల వ్యాపారుల కుటుంబానికి చెందిన వ్యక్తి. ఇతను ముంబయ్‌లో పుట్టాడు. కొలంబియా యూనివర్సిటీ నుంచి సైకాలజీ కోర్సు పూర్తిచేశాక తండ్రి బాటలో వజ్రాల వ్యాపారంపై దృష్టి పెట్టి వజ్రాల నాణ్యతను పరీక్షించడంలో ప్రావీణ్యాన్ని పొందాడు.

వ్యక్తిగతం

[మార్చు]

సంజీవ్ చాంద్ మెహతా భార్య పేరు ఆనీ, ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు, కుమారుడి పేరు అర్జున్, కుమార్తె పేరు అనౌష్క. సంజీవ్ ఖాళీ సమయాలలో సరదాగా ఫ్లూట్ వాయిస్తారు, దీని కొరకు ప్రొఫెషనల్ శిక్షణ కూడా తీసుకున్నారు.

వ్యాపారాలు

[మార్చు]

సంజీవ్ హాంకాంగ్, అమెరికా, గల్ఫ్ దేశాల్లో తమ వజ్రాల సంస్థ తరపున ప్రదర్శనలు ఏర్పాటు చేసి వజ్రాల విశిష్టత గురించి మార్కెటింగ్ చేస్తూ అనేక దేశాల వ్యక్తులతో పరిచయమయ్యాడు. అలాగే వజ్రాలతో పాటూ ఆయా ప్రాంతాలకు ప్రత్యేకమైన వస్తువులను ఇతర దేశాలకు పంపించేందుకు "ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్‌పోర్ట్స్" వ్యాపారాన్ని ప్రారంభించాడు.

విద్య

[మార్చు]
  • కొలంబియా యూనివర్సిటీ నుంచి సైకాలజీ కోర్సు
  • వజ్రాల వ్యాపారి అయిన ఇతను వజ్రాలపై మరింత పరిజ్ఞానం పెంచుకునేందుకు లాస్ ఏంజిలెస్ లోని "జెమాలజికల్ ఇనిస్టిట్యూట్" నుంచి డిగ్రీ చేశారు.

మూలాలు

[మార్చు]
  • ఈనాడు ఆదివారం పుస్తకం - 20-07-2014 - 15వ పేజీ (ఈస్ట్ ఇండియా కంపెనీ ఓ భారతీయుడి సొంతం!)