Jump to content

సంతాన వేణుగోపాలస్వామి దేవాలయం (గద్వాల)

వికీపీడియా నుండి
సంతాన వేణుగోపాలస్వామి దేవాలయం
సంతాన వేణుగోపాలస్వామి దేవాలయం
మతం
అనుబంధంహిందూ
జిల్లాజోగులాంబ జిల్లా
దైవంవేణుగోపాలస్వామి
ప్రదేశం
ప్రదేశంభీంనగర్, గద్వాల
రాష్ట్రంతెలంగాణ
దేశంభారతదేశం
వాస్తుశాస్త్రం.
శైలిదేవాలయ
సృష్టికర్తభీంరెడ్డి, నాంచారమ్మ
పూర్తైనది19వ శతాబ్దం

సంతాన వేణుగోపాలస్వామి దేవాలయం అనేది తెలంగాణ రాష్ట్రం, జోగులాంబ గద్వాల జిల్లా, గద్వాల పట్టణంలో ఉన్న దేవాలయం. వేణుగోపాలస్వామిని 41 రోజులు భక్తి శ్రద్ధలతో కొలిస్తే వారికి సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించిన స్థలంలోనే హయగ్రీవస్వామి స్వయంభూగా ఉద్భవించారు.[1]

చరిత్ర

[మార్చు]

19వ శతాబ్దంలో (1865-1901) 36 ఏళ్ళపాటు గద్వాల సంస్థానాన్ని రాణి వెంకటలక్ష్మమ్మ పాలించింది. ఆమె దత్తపుత్రుడు రాజా రామభూపాలుడి సోదరుడు భీంరెడ్డి, నాంచారమ్మ దంపతులకు సంతానం లేకపోవడంతో సంస్థాన పురో హితుల సూచన మేరకు భీంనగర్‌లో సంతాన వేణుగోపాలస్వామి దేవాలయాన్ని నిర్మించారు. ఆ తర్వాత భీంరెడ్డి, నాంచారమ్మ దంపతులకు ఆరుగురు కుమారులు జన్మించారు. వారిలో పెద్ద కుమారుడు రాజా సీతారాం భూపాల్‌ సంస్థాన పాలకుడిగా కొనసాగాడు. వంశపారంపర్య ధర్మకర్తలు 2022లో ఈ దేవాలయానికి మరమ్మతు చేయించి, తీర్చిదిద్దారు.[2]

బ్రహోత్సవాలు

[మార్చు]

ప్రతి సంవత్సరం మార్గశిర మాసం బహుళ పక్షంలో (డిసెంబరు నెల మూడోవారంలో) మూడురోజులపాటు బ్రహోత్సవాలు నిర్వహించబడుతాయి. ఈ ఉత్సవాలను గద్వాల చిన్నజాతర, భీంనగర్‌ జాతర అని కూడా అంటారు. తొలిరోజు ఉదయం పుణ్యాహవచనం, అంకురార్పణ, ధ్వజారోహణం, భేరీ పూజ, అనంతరం సాయంత్రం కల్యాణోత్సవం నిర్వహిస్తారు. రెండోరోజు ఉదయం నిత్యహోమం, రాత్రి స్వామివారి రథోత్సవం, ఊరేగింపు ఉంటుంది. మూడోరోజు పారువేట, తీర్థావలి, నాగవల్లి, పూర్ణాహుతి, దేవతా విసర్జనతో బ్రహోత్సవాలు ముగుస్తాయి.[3]

మూలాలు

[మార్చు]
  1. telugu, NT News (2021-12-25). "కొంగు బంగారం.. సంతాన వేణుగోపాలస్వామి". www.ntnews.com. Archived from the original on 2022-12-16. Retrieved 2022-12-16.
  2. ABN (2022-12-13). "నేటి నుంచి బ్రహ్మోత్సవాలు". Andhrajyothy Telugu News. Archived from the original on 2022-12-16. Retrieved 2022-12-16.
  3. telugu, NT News (2022-12-14). "బ్రహ్మాండనాయకుడి వేడుకకు వేళాయే." www.ntnews.com. Archived from the original on 2022-12-14. Retrieved 2022-12-16.