Jump to content

సంతోష్ చౌహాన్ సర్వాన్

వికీపీడియా నుండి
సంతోష్ చౌహాన్ సర్వాన్

పదవీ కాలం
2014 – 2019
ముందు రాజ్‌బీర్ సింగ్ బరారా
తరువాత వరుణ్ చౌదరి
నియోజకవర్గం ములానా

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ బీజేపీ
తల్లిదండ్రులు గోవర్ధన్‌ చౌహాన్‌ [1]
వృత్తి రాజకీయ నాయకుడు

సంతోష్ చౌహాన్ సర్వాన్ హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2014లో జరిగిన హర్యానా శాసనసభ ఎన్నికలలో ములానా నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యురాలిగా ఎన్నికైంది.[2][3][4][5]

రాజకీయ జీవితం

[మార్చు]

సంతోష్ చౌహాన్ సర్వాన్ తన తండ్రి గోవర్ధన్‌ చౌహాన్‌ అడుగుజడల్లో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1991లో జరిగిన హర్యానా శాసనసభ ఎన్నికలలో దబ్వాలి శాసనసభ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి శాసనసభ్యురాలిగా ఎన్నికైంది.[6] ఆమె ఆ తరువాత భారతీయ జనతా పార్టీలో చేరింది.

ఆమె 2014లో జరిగిన హర్యానా శాసనసభ ఎన్నికలలో ములానా నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌ఎల్‌డి అభ్యర్థి రాజ్‌బీర్ సింగ్‌పై 5649 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి శాసనసభ సభ్యురాలిగా ఎన్నికైంది.

సంతోష్ చౌహాన్ సర్వాన్ 2024లో జరిగిన హర్యానా శాసనసభ ఎన్నికలలో ములానా నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థి పూజా చౌదరి చేతిలో 12865 ఓట్లు తేడాతో ఓడిపోయింది. పూజా చౌదరికి 79089 ఓట్లు, బీజేపీ అభ్యర్థి సంతోష్ చౌహాన్ శర్వన్ కి 66224 ఓట్లు వచ్చాయి.[7]

మూలాలు

[మార్చు]
  1. India Today (30 September 2024). "Haryana elections: The high-stakes battle of dynasties" (in ఇంగ్లీష్). Retrieved 24 October 2024.
  2. India.com (19 October 2014). "Haryana Assembly Elections 2014: List of winning MLAs" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
  3. The Indian Express (2 October 2024). "Haryana elections: A veteran woman BJP leader faces off with Congress, and angry farmers" (in ఇంగ్లీష్). Retrieved 24 October 2024.
  4. Hindustantimes (13 September 2019). "Haryana Assembly Polls: Santosh Chauhan Sarwan, Mullana (reserved) MLA". Retrieved 24 October 2024.
  5. TimelineDaily (4 October 2024). "Women Face-off: BJP Veteran Vs Congress Debutant In Mulana Constituency" (in ఇంగ్లీష్). Retrieved 24 October 2024.
  6. "1991 Haryana Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 1 July 2024.
  7. Election Commision of India (8 October 2024). "Haryana Assembly Election Results 2024 - Mulana". Retrieved 24 October 2024.