సంరక్షకుడు (లీగల్)

వికీపీడియా నుండి
(సంరక్షకుడు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

బిడ్డకు తండ్రి సంరక్షకుడుగా ఉంటాడు. తండ్రి లేక లేకపోతే తల్లి సంరక్షకురాలిగా ఉంటుంది.

తల్లిదండ్రులు లేని బిడ్డకు బంధువులలో ఒకరు సంరక్షకుడిగా ఉంటారు.

కొన్ని పరిస్థితులలో బిడ్డకు మైనారిటీ తీరేంత వరకు న్యాయస్థానం సంరక్షకుడిని నియమిస్తుంది. ఈ సంరక్షకుడు ఆ బిడ్డకు సంబంధించిన వ్యక్తిగత, ఆర్థిక పరమైన లావాదేవిలకు ఆ బిడ్డ మైనారిటీ తీరేంత వరకు బాధ్యత వహించవలసి ఉంటుంది.

న్యాయస్థానం సంరక్షకుడిని నియమించే పద్ధతి

[మార్చు]

బిడ్డకు సంరక్షకుడిగా ఉండాలనుకునే వ్యక్తి లాయరు ద్వారా అపాయింట్‌మెంట్ అండ్ డిక్లరేషన్ ఆఫ్ గార్డియన్ కింద కోర్టులో ఒక కేసు ఫైల్ చేయాలి.

తనను ఈ బిడ్డకు సంరక్షకుడిగా అపాయింట్ చేస్తూ డిక్లేర్ చేయమని కోర్టువారిని ఈ ఫైల్ లో కోరాలి.

ఈ కేసులను సామాన్యంగా జిల్లా కోర్టులు మాత్రమే ఎంటర్‌టెయిన్ చేస్తాయి.

ఈ కేసు ఫైల్ చేసినప్పుడు కోర్టు వారు ఆ వ్యక్తి యొక్క క్యారెక్టర్, సంపాదన మార్గాలు, ఆస్తి,పాస్తులు బిడ్డతో ఉండే అనుబంధం, బిడ్డ మైనరా? కాదా? ఎన్నిరోజుల్లో మైనారిటీ తీరుతుంది... ఇవేగాక, బిడ్డను ప్రత్యేకంగా ప్రశ్నించి, ఇతనితో జీవించడం ఇష్టమా కాదా అని పరిశీలించాక సంరక్షకుడిగా ఉండే వ్యక్తికి కొన్ని షరతులను పెట్టి వాటికి ఒప్పుకుంటే ఆ బిడ్డకి ఇతన్ని సంరక్షకుడిగా నియమిస్తుంది.