సత్నాం సింగ్ భమారా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సత్నాం సింగ్ భమారా
2013 లో జాతీయ క్రీడల్లో భమారా (ఎడమ)
No. 52 – టెక్సాస్ లెజెండ్స్
Positionమధ్యలో
Leagueఎన్.బి.ఏ డెవలప్మెంట్ లీగ్
Personal information
Born (1995-12-10) 1995 డిసెంబరు 10 (వయసు 28)
బల్లో కే, పంజాబ్
Nationalityభారతీయుడు
Listed height7 అ. 2 అం. (218 cమీ.)
Listed weight290 పౌ. (132 కి.గ్రా.)
Career information
High schoolఐఎంజీ అకాడమీ, (బ్రాడెంటన్, ఫ్లోరిడా)
NBA draft2015 / Round: 2 / Pick: 52nd overall
Selected by the డల్లాస్ మేవరిక్స్
Pro playing career2015–present
Career history
2015–ప్రస్తుతంటెక్సాస్ లెజెండ్స్, (డి-లీగ్)

సత్నాం సింగ్ భమారా (జననం: 1995 డిసెంబరు 10) పంజాబ్కు చెందిన బాస్కెట్ బాల్ క్రీడాకారుడు. నేషనల్ బాస్కెట్ బాల్ అసోసియేషన్ (ఎన్.బి.ఎ) డెవలప్మెంట్ లీగ్ లో టెక్సాస్ లెజెండ్స్ కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. 2015 లో అమెరికాలోని టెక్సాస్కు చెందిన డల్లాస్ మేవరిక్స్ ఇతన్ని తమ 52వ ఆటగాడిగా ఎన్నుకోవడంతో భారతదేశం నుండి ఎన్.బి.ఏకి ఎన్నికైన తొలి భారతీయ ఆటగాడయ్యాడు. ఇతని ఎత్తు ఏడు అడుగుల రెండు అంగుళాలు, బరువు 132 కిలోలు. సెంటర్ పొజిషన్ లో ఆడతాడు. ఇతను ఫ్లోరిడా లోని ఐఎంజీ అకాడమీలో హైస్కూలు బాస్కెట్ బాల్ ఆడాడు. 14 ఏళ్ళ వయసు నుండే మీడియా దృష్టిని ఆకర్షించాడు. ఐఎంజీ అకాడమీ నుండి ఎన్.బి.ఏ దృష్టిలో పడ్డాడు.

బాల్యం

[మార్చు]

సత్నాం 1995 డిసెంబరు 10 న పంజాబ్ రాష్ట్రంలో బర్నాలా జిల్లా, బల్లో కే అనే గ్రామంలో జన్మించాడు. ఆ గ్రామ జనాభా కేవలం 800 మాత్రమే.[1] అతని తండ్రి బల్బీర్, తాత గోధుమ పండించే రైతులు, మిల్లర్లు. ఆ గ్రామం పక్కా రోడ్డుకు సుమారు నాలుగు మైళ్ళ దూరంలో ఉండేది. 1980వ దశకం మధ్యలో బల్బీర్ గ్రామంలో అందరికన్నా పొడవైన వ్యక్తిగా గుర్తింపు పొందాడు. అంర పొడవు ఉండటం వల్ల ఆ గ్రామంలో కొంతమంది అతన్ని దగ్గర్లో క్రీడా సౌకర్యాలున్న పట్టణానికి వెళ్ళి బాస్కెట్ బాల్ ఆట ప్రయత్నించ మన్నారు. కానీ తండ్రి మాత్రం కుమారుడు తన అడుగు జాడల్లోనే నడిచి వ్యవసాయం కొనసాగించాలనుకున్నాడు. దాంతో బల్బీర్ ఆ గ్రామంలోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఆగ్రామానికి నాయకుడిగా ఎన్నికయ్యాడు. పెళ్ళి చేసుకుని ముగ్గురు సంతానానికి తండ్రి అయ్యాడు. వారిలో రెండో వాడు సత్నాం.

తొమ్మిదేళ్ళ వయసులోనే సత్నాం గ్రామంలో చాలా మంది యువకులకంటే పొడవుగా పెరిగాడు. అప్పుడే అతని తండ్రి ప్రాంతీయంగా ఉన్న బాస్కెట్ బాల్ మైదానానికి తీసుకెళ్ళి ఆడించే వాడు. అతను పొడుగు పెరిగే కొద్దీ ఆ క్రీడలో మంచి నైపుణ్యం అలవడింది. దాంతో బల్బీర్ తన కుమారుడికి శిక్షణ ఇవ్వడానికి గురువుల కోసం అంవేషించసాగాడు. పదేళ్ళ వయసులో లూధియానా బాస్కెట్ బాల్ అకాడమీలో చేర్చాడు.

మూలాలు

[మార్చు]
  1. "NBA Awaits Satnam From India, So Big and Athletic at 14". AOL News. 10 November 2010. Archived from the original on 10 మార్చి 2013. Retrieved 3 ఆగస్టు 2016.