సత్నామ్ సింగ్ సంధూ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సత్నామ్ సింగ్ సంధూ

రాజ్యసభ సభ్యుడు
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2024 జనవరి 30
నియోజకవర్గం నామినేట్ సభ్యుడు

వ్యక్తిగత వివరాలు

సత్నామ్ సింగ్ సంధూ భారతదేశానికి చెందిన విద్యావేత్త, రాజకీయ నాయకుడు. ఆయన విద్యా రంగంలో చేసిన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఆయనను రాష్ట్రపతి కోటాలో 2024 జనవరి 30న పంజాబ్ నుండి నామినేటెడ్ రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ చేసింది.[1][2]

విద్యావేత్తగా[మార్చు]

సత్నామ్ సింగ్ సంధూ  ఓ మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించి చిన్నతనంలో చదువుకోడానికి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఎన్నో ఇబ్బందులు ఎదురైనా పట్టుదలతో ఉన్నత విద్యను అభ్యశించి తాను అనుభవించిన బాధలు ఎవరూ అనుభవించకూడదన్న ఆవేదనతో 2001లో మొహాలీ ప్రాంతంలో చండీగఢ్ గ్రూప్ ఆఫ్ కాలేజీలను, 2012లో చండీగఢ్ యూనివర్శిటీని నెలకొల్పాడు. ఈ యూనివర్శిటీకి ఆయన ఛాన్సలర్‌గా వ్యవహరిస్తున్నాడు. లక్షల మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు రెండు ఛారిటీ  ‘ఇండియన్ మైనారిటీస్ ఫౌండేషన్’, న్యూ ఇండియా డెవలప్‌మెంట్ (NID) ఫౌండేషన్ ద్వారా ఆర్థిక సాయం చేస్తున్నాడు. విద్యారంగంలో ఆయన సేవలను గుర్తించి కేంద్రం ఆయనకు రాష్ట్రపతి కోటాలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయనను 2024లో రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ చేసింది. [3][4]

మూలాలు[మార్చు]

  1. Eenadu (30 January 2024). "రాజ్యసభకు సత్నామ్‌ సింగ్‌ సంధూ". EENADU. Archived from the original on 7 February 2024. Retrieved 7 February 2024.
  2. The Hindu (30 January 2024). "President nominates educationist Satnam Singh Sandhu to Rajya Sabha" (in Indian English). Archived from the original on 30 January 2024. Retrieved 30 January 2024.
  3. Telugu, TV9 (30 January 2024). "Satnam Singh Sandhu: రాజ్యసభకు సత్నామ్ సింగ్ సంధు.. నామినేట్ చేసిన రాష్ట్రపతి ముర్ము". TV9 Telugu. Archived from the original on 7 February 2024. Retrieved 7 February 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. Sakshi (30 January 2024). "రాజ్యసభకు సత్నామ్‌.. మోదీ అభినందనలు.. ఎవరీయన?". Archived from the original on 7 February 2024. Retrieved 7 February 2024.