సత్యపదానంద ప్రభూజీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సత్యపదానంద ప్రభూజీ హిందూ ఆధ్యాత్మిక గురువు. ఆయన సాయిధామం (కీసర) వ్యవస్థాపకుడు. సాయిధామం ద్వారా విద్యాలయం, వృద్ధాశ్రమం, వృత్తి శిక్షణాకేంద్రం నిర్వహిస్తూ ధార్మిక సేవకు పాటుపడిన మార్గదర్శకుడాయన.[1]

జీవిత విశేషాలు

[మార్చు]

ఆయన 1939 ఫిబ్రవరి 21గుంటూరు జిల్లా మానేపల్లి గ్రామంలో జన్మించారు.డబుల్ ఎంఏ చేశారు.సివిల్ ఇంజనీరింగ్, న్యాయవాద పట్టాలు కూడా పొందారు.[2] ప్రభుజీ ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగిన అనంతరం 1989లో పేదలకు సేవచేసేందుకు, ప్రజలను భక్తిమార్గంలో నడిపేందుకు సాయిధామం ఆశ్రమాన్ని స్థాపించారు. ఆయన మూడు దశాబ్దాలుగా స్వచ్ఛంద అంరియు ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రభుజీ సన్యాసం స్వీకరించిన తర్వాత ఆయన కుటుంబీకులు హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. ప్రభుజీ తన ఆధ్యాత్మిక ప్రసంగాలతో యువతను సన్మార్గంలో నడిపించారు. ప్రజలను ఆధ్యాత్మికతవైపు మళ్లించి సేవా కార్యక్రమాల్లో భాగస్వాములను చేసారు.స్వామీజీ నిరంతరం హిందూ సమాజం సంరక్షణకు కృషి చేశారు. సనాతన ధర్మ పరిరక్షణకు ఆయన నిరంతరం పరితపిస్తుండేవారు.[3] ష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) లో కూడా చాలా కాలం పనిచేశారు. సమాజ సేవకోసం తపించిన సత్యపదానంద 1989 లో ఉపాధ్యాయ వృత్తిని పరిత్యజించి సమాజ సేవకు నడుంకట్టారు.[2]

సాయిథామం

[మార్చు]

ఆయన సాధన, ద్యానం చేయుటకు "సాయిథామం" అనే పుణ్యక్షేత్రాన్ని స్థాపించారు.[4] స్వామిజీ స్థాపించిన ఆశ్రమాల్లో పేద విద్యార్థులకు 1నుంచి 10వ తరగతి వరకూ ఉచిత విద్య, అనాథ బాలలు, వృద్ధులకు అండగా అనాధాశ్రమం ఏర్పాటు చేశారు. ఆశ్రమంలో వైద్యశాలను ఏర్పాటు చేసి ప్రజలకు ఉచిత వైద్యసేవలు అందింస్తారు.ఈ ఆశ్రమం హైదరాబాద్‌నుండి 30 కిలోమీటర్ల దూరంలో (ప్రముఖ శైవక్షేత్రమైన కీసర నుండి ఆరుకిలోమీటర్ల దూరం) నెలకొని ఉంది. ఇందుకోసం 1991 లో 33 ఎకరాల స్థలాన్ని ఎన్నుకున్నారు. విద్య, వైద్యం, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సా మాజిక సేవా కార్యక్రమాలకు కేంద్రంగా దీన్ని తీర్చిదిద్దారు. షిర్టీసాయి భక్తుడైన సత్యపదానంద ఈ సంస్థలకు కేంద్రంగా రూపొందించిన క్షేత్రానికి ‘సాయిధామం’ అన్న పేరు పెట్టారు. షిర్డీసాయి ఆశీస్సులతో సత్యపదానంద చేపట్టిన పథకాలు, కార్యక్రమాలు విజయవంతంగా నడుస్తున్నాయి.సాయిధామం కేంద్రంగా షిర్డీసాయినాథుడి బోధనలను, తత్త్వాన్ని ప్రచారం చేసేందుకు రెండు ప్రధాన విభాగాలు ఏర్పాటు చేశారు. మొదటిది ఆధ్యాత్మిక విభాగం కాగా, రెండవది సేవా విభాగం[2] .

మరణం

[మార్చు]

ఆయన జూలై 23 2015 గురువారం పరమపదించారు.[5] నల్లగొండ జిల్లా బొమ్మలరామారం మండలం పెద్దపర్వతాపురంలోని ఆశ్రమంలో అస్వస్థతకు గురైన ప్రభుజీకి చికిత్స చేయించేందుకు గురువారం ఉదయం ఆసుపత్రికి తరలించిన కొద్దిసేపటికే తుది శ్వాస విడిచారు.[6]

మూలాలు

[మార్చు]
  1. సత్యపదానంద మృతికి సంతాపం[permanent dead link]
  2. 2.0 2.1 2.2 "సమాజ సేవలో తరించిన సత్యపదానంద". పి.వి. రమణారావు. ఆంధ్రభూమి. Retrieved 24 July 2015.
  3. "త్యపదానంద అస్తమయం". ఆంధ్రభూమి. Retrieved 24 July 2015.
  4. "Swami Satyapadananda passes away". హన్స్ ఇండియా. Archived from the original on 4 మార్చి 2016. Retrieved 24 July 2015.
  5. "సాయిధామం పీఠాధిపతి కన్నుమూత". Archived from the original on 2016-03-14. Retrieved 2015-07-29.
  6. సత్యపదానంద అస్తమయం

ఇతర లింకులు

[మార్చు]