Jump to content

సన్ జూ

వికీపీడియా నుండి

సన్ జూ (ఆంగ్లం: Sun Tzu) ప్రాచీన చైనాకి చెందిన సేనాధిపతి, సైనిక వ్యూహకర్త, రచయిత, తాత్వికుడు. యుద్ధ వ్యూహాల గురించి ఆయన రాసిన ది ఆర్ట్ ఆఫ్ వార్ పాశ్చాత్యదేశాల, తూర్పు ఆసియా దేశాల యుద్ధ వ్యూహాలను ప్రభావితం చేసింది. ఆయన రచనల్లో ముఖ్యంగా యుద్ధానికి ప్రత్యామ్నాయ ప్రణాళికలు, యుద్ధాన్ని నివారించడం, నిఘా ఏర్పాటుచేసుకోవడం, పొరుగు వారితో సంబంధాలు సృష్టించుకోవడం, కొనసాగించడం, మనకన్నా మెరుగైన శత్రువు ఎదురైనప్పుడు తాత్కాలికంగా అణిగిఉండటం వంటి విషయాలు చర్చిస్తాయి.[1] సన్ జూ ని చైనా, తూర్పు ఆసియా దేశాలు యుద్ధానికి, చరిత్రకి సంబంధించి పూజ్యుడిగా భావిస్తారు.

జపాన్‌లోని తోటోరిలోని యూరిహామాలో సన్ ట్జు విగ్రహం

ఈయన రచనలు కూర్చబడినప్పటి నుంచి తూర్పు ఆసియాదేశాలు తమ యుద్ధ వ్యూహాల్లో విరివిగా వాడుతూ వచ్చారు. 20వ శతాబ్దంలో పాశ్చాత్య దేశాల్లో ది ఆర్ట్ ఆఫ్ వార్ ప్రాబల్యం బాగా పెరిగింది. పోరాట స్ఫూర్తి అవసరమైన సాంస్కృతిక, రాజకీయ, క్రీడలు, ఆధునిక యుద్ధ తంత్రాల లాంటి అన్ని రంగాల్లో ఈ పుస్తకంలో పేర్కొనబడ్డి విషయాలు ఉపయోగించారు.[2][3][4][5]

సన్ జూ చారిత్రాత్మకత అంత ఖచ్చితంగా తెలియదు. హాన్ వంశ చరిత్రకారుడైన సిమా కియాన్, ఇంకా సాంప్రదాయ చీనా చరిత్రకారులు ఈయన్ను వు అనే రాజు దగ్గర మంత్రి అయిఉండవచ్చని, ఆయన జీవితకాలం సా.పూ 544–496 మధ్య జీవించి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు.

మూలాలు

[మార్చు]
  1. Ancient warfare edited by John Carman and Anthony Harding, page 41
  2. Scott, Wilson (7 March 2013), "Obama meets privately with Jewish leaders", The Washington Post, Washington, D.C., archived from the original on 24 July 2013, retrieved 22 May 2013
  3. Obama to challenge Israelis on peace, 8 March 2013, retrieved 22 May 2013 {{citation}}: Unknown parameter |agency= ignored (help)
  4. Garner, Rochelle (16 October 2006), "Oracle's Ellison Uses 'Art of War' in Software Battle With SAP", Bloomberg, archived from the original on 20 October 2015, retrieved 18 May 2013
  5. Hack, Damon (3 February 2005), "For Patriots' Coach, War Is Decided Before Game", The New York Times, retrieved 18 May 2013
"https://te.wikipedia.org/w/index.php?title=సన్_జూ&oldid=3482892" నుండి వెలికితీశారు