సమితులు
![]() | విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. (నవంబర్ 2016) |
సమితి అనగా ఒక గణితశాస్త్ర భావన. ఏదైనా కొన్ని వస్తువుల సముదాయాన్ని సమితి అని నిర్వచించవచ్చు. ఇది వినడానికి చాలా చిన్నదిగా అనిపించినా గణిత శాస్త్రంలో ఇది ఒక అతి ముఖ్యమైన భావన. 19వ శతాబ్దం చివరిలో దీనిని కనుగొనడం వలన గణిత విద్యలో దీని ప్రాధాన్యం చాలా ఉంది. చాలా దేశాల్లో లోని ప్రాథమిక విద్యలో ఇది ఒక భాగము.
నిర్వచనం[మార్చు]
సునిర్వచిత మూలకముల సముదాయాము.
సమితులను కనిపెట్టిన శాస్త్రవేత్త జార్జి కాంటర్ సమితిని ఈ విధంగా నిర్వచించాడు.
వివిధ రకాలైన వేర్వేరు వస్తువుల సముదాయాన్ని సమితి అనవచ్చు.
సంకేతము[మార్చు]
సాధారణంగా సమితులను A, B, X మొదలగు పెద్ద అక్షరములతో సూచింతురు. సమితిలోని మూలకములను సూచించుటకు x, y మొదలగు చిన్న అక్షరములను వాడుదము.
A = {x, y, z}లో A సమితి సూచించు సంకెతము, x, y, zలు ఆ సమితి లోని మూలకములు.
సమితి పరిమాణం[మార్చు]
రకాలు[మార్చు]
సార్వత్రికసమితులు[మార్చు]
సహజ సంఖ్యలు N = {1, 2, 3, 4, .....}
పూర్ణాంకలు W = {0, 1, 2, 3, ...}
పూర్ణ సంఖ్యల సమితి Z = {...-3, -2, -1, 0, 1, 2, 3, .....}
అకరణీయ సంఖ్యల సమితి Q = {p/q: p, q ∈ Z, q ≠ 0 }
కరణీయ సంఖ్యల సమితి I
వాస్తవ సంఖ్యలు R
సంకీర్ణ సంఖ్యలు C
ఉప సమితులు[మార్చు]
ఒక సమితి A లోని ప్రతి మూలకమూ B అనే సమితికీ చెందినట్లయితే సమితి A ని B కి ఉపసమితి అంటారు.దీన్ని (A సమితి B సమితిలో ఉంది అని కూడా అనవచ్చు) అని రాస్తారు.
ప్రత్యేక సమితులు[మార్చు]
- సార్వత్రిక సమితి
- అన్ని మూలకాలు కలిగిన సమితి
- ఏక మూలక సమితి
- ఒకే ఒక మూలకం కలిగిన సమితి
- శూన్య సమితి
- అసలు మూలాకాలే లేని సమితి
శూన్య సమితిని Φతో సూచించెదము.